తెలంగాణ

విపక్షంలో మిగిలింది ఇద్దరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ బలం పెరుగుతూ పోయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపి గుత్తా టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో టిఆర్‌ఎస్ బలం 11నుంచి 14కు పెరిగింది. తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక టిడిపి ఎంపి మల్లారెడ్డి ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరడంతో తెలంగాణ నుంచి టిడిపికి పార్లమెంటులో స్థానం లేకుండా పోయింది. అదే విధంగా ఖమ్మం నుంచి గెలిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీకి కూడా తెలంగాణలో స్థానం లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపిలు గెలిస్తే వారిలో గుత్తా కారెక్కేస్తున్నారు. ఇక మిగిలింది నంది ఎల్లయ్య మాత్రమే. వీరు కాకుండా బిజెపికి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌లు మిగిలారు. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం ఏకంగా టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. మిగిలిన ఏకైక ఎంపి నంది ఎల్లయ్య మాత్రమే. నాగర్‌కర్నూల్ నుంచి గెలిచిన నంది ఎల్లయ్యను ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమించారు. కాగా రాజ్యసభలో కె కేశవరావు టిఆర్‌ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌లూ ఎన్నికయ్యారు. దాంతో లోక్‌సభలో 14, రాజ్యసభలో మూడుకు టిఆర్‌ఎస్ బలం పెరిగింది.
కాంగ్రెస్ నెంబర్ 13
కాంగ్రెస్ నుంచి ప్రజాప్రతినిధులు వలస బాట పట్టడంతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు నీరుగారి పోతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 21 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకుని కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన దొంతి మాధవరెడ్డితో కలిపి ఆ సంఖ్య 22కు చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరగా, మరో ఇద్దరు ఆకస్మికంగా మరణించారు. ఆ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్సే విజయం సాధించింది. మిగిలిన 13మందిలోనూ మరో ముగ్గురు జంప్‌జిలానీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో సోనియా గాంధీ తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు దృష్టి సారించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సరైన సూచనలు చేసి, కార్యకర్తలకు మనోధైర్యం కల్పించాల్సిందిగా ఆమె దిగ్విజయ్ సింగ్‌ను ఆదేశించారు. ఈ మేరకు దిగ్విజయ్ సింగ్ బుధవారం హైదరాబాద్‌కు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయనున్నారు.
మాయమైన మూడు పార్టీలు
ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 9 రాజకీయ పార్టీలు ప్రాతినిథ్యాన్ని సాధించగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, బిజెపిలు ప్రతినిథిత్వం సంపాదించుకున్నాయి. రెండేళ్ల కాలపరిమితిలో తెలంగాణ అసెంబ్లీలో మూడు పార్టీలు అదృశ్యమయ్యాయి. సిపిఐ తరఫున గెలిచిన ఏకైక సభ్యుడు రవీంద్ర నాయక్ టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో శాసన సభలో ఆ పార్టీకి ఉనికి లేకుండా పోయింది. బిఎస్‌పి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరూ టిఆర్‌ఎస్‌లో చేరి తమ పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ముగ్గురు సభ్యులు కూడా టిఆర్‌ఎస్‌లో చేరి పార్టీని విలీనం చేశారు. ఆ తరువాత ఇప్పుడు సిపిఐ సభ్యుడు చేరారు. టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలువగా 12 మంది టిఆర్‌ఎస్‌లో చేరారు. టిడిపి ఎమ్మెల్యేలు 12 మంది సమావేశం అయి టిడిపి శాసన సభాపక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు తీర్మానం చేశారు. వీరి విలీనాన్ని స్పీకర్ గుర్తించేశారు. విగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డిలు టిడిపి ఎమ్మెల్యేలుగా సభలో కొనసాగుతున్నారు.