తెలంగాణ

కట్నం కోసం చిత్రహింసలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్, జూన్ 13: అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్న డిసిటివో (డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్) ఇదిగాని యుగేందర్‌ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని అతని భార్య ఇదిగాని రాజకుమారి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్‌లో బాధితురాలితో పాటు ఆమె తండ్రి బండి సమ్మయ్య మేనమామతో కలసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 9న మంచిర్యాలలోని పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్త యుగేందర్‌కు కౌనె్సలింగ్ ఇప్పించారని, అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తిరిగి మంచిర్యాల ఎఎస్పీ విజయ్‌కుమార్‌ను సంప్రదించామని వారు పేర్కొన్నారు. ఎఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. 2013 ఫిబ్రవరి 3న గోదావరి ఖని బస్టాండు కాలనీలో నివసించే యుగేందర్‌కు తన తండ్రి బండి సమ్మయ్య రూ.25 లక్షల వరకట్నం నగదుగా చెల్లించి అన్ని లాంచనాలతో వివాహం చేశారని బాధితురాలు రాజకుమారి తెలిపారు. పెళ్లి అనంతరం కొన్ని రోజులకే అత్తింటివారు తమను వేధించడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఉద్యోగ రీత్యా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఎసిటివోగా విధులు నిర్వహించేవాడని, తనను మాత్రం గోదావరిఖనిలోనే ఉండాలని వేధించేవాడని తెలిపింది. గోదావరి ఖనిలో అత్త కాంతమ్మ, మామ కొమురయ్య, ఆడపడుచు నీరజ, మరిది సురేష్ తనను మానసికంగా వేధించేవారని, తాను పురిటినొప్పులకు తండ్రిగారి ఇల్లయిన కృష్ణకాలనీకి వెళ్లినప్పటికీ యుగేందర్ తన కొడుకును చూడడానికి కూడా రాలేదని పేర్కొంది. గోదావరి కాలనీకి చెందిన మరో అమ్మాయితో తన భర్త అక్రమ సంబంధాన్ని పెట్టుకొని తనను తరుచూ వేధిస్తుండేవాడని ఆరోపించింది. కుటుంబ సభ్యులు అందరూ కలసి తమ సమస్యను పరిష్కరిస్తామని పిలిపించుకొని తన తండ్రి సమ్మయ్యపై గోదావరిఖని బస్టాండు కాలనీలో దాడికి యత్నించారని పేర్కొంది. తనకు పుట్టిన కుమారుడు శ్రీమన్నారాయణతో తనకు సంబంధం లేదని, అతన్ని ఒదిలించుకునేందుకు దిండుతో చంపే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్నానని పేర్కొంది. అదనపు కట్నం తేవాలని, లేనిపక్షంలో తనకు విడాకులు ఇవ్వాలని లేకుంటే మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తానని బెదిరిస్తున్నారని పేర్కొంది. యుగేందర్ నుంచి ప్రాణభయం ఉందని, వెంటనే ఆయనను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది.
చిత్రం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజకుమారి