తెలంగాణ

కోయిల్‌సాగర్ నిర్వాసితులకు వారంలో పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 13: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు వారం రోజుల్లో పరిహారాన్ని చెల్లిస్తామని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల బాటలో భాగంగా సోమవారం ఆయన కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించి నిర్వాసితులతో ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత పదకొండేళ్లుగా కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులు నత్తనడక నడవడం విచారకమన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించామని, మరో 45 రోజుల్లో పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిర్వాసితులకు చెక్కులు ఇచ్చిన అధికారులు ఇంకా వాటికి బిల్లులు చెల్లించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తూ, వారం రోజుల్లో అన్ని క్లియరెన్స్‌లు ఇస్తామన్నారు. నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పెండింగ్‌లో ఉన్న చెక్కులకు వడ్డీతో సహా చెల్లింపులు జరిపిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అంటే గిట్టనివారు ఇక్కడి ప్రాజెక్టులను ఆపడానికి కుట్రలు చేస్తున్నారని, వాటి నిర్మాణానికి అవసరమైతే పోలీసులను, మిలటరీని దింపుతామని, ప్రాజెక్టులకు ఆటంకాలు సృష్టించే వారి తాట తీస్తామని మంత్రి హెచ్చరించారు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణలో అక్కడక్కడా సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, నాలుగైదు రోజుల్లో పరిష్కరిస్తామని వాటిని తెలిపారు. జూలై 20 నాటికి పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి 31వ తేదీనాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ సాగునీరు అందిస్తామన్నారు. కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌లో 4.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది ఖరీఫ్‌లో మరో నాలుగు లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల వలన భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పునరావాస కేంద్రాల్లో పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజ్, రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు.