తెలంగాణ

తెలంగాణ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదాయ వృద్ధిలో దేశంలోనే టాప్ కరవు సమయంలోనూ రికార్డుల మోత
ఏప్రిల్, మే నెలల్లో 27.45 శాతం వృద్ధి వార్షికాదాయం పెరుగుదలకు చాన్స్
బంగారు తెలంగాణకు ఇదే రహదారి సంతృప్తి వ్యక్తం చేసిన సిఎం కెసిఆర్

‘తెలంగాణ ఆవిర్భావంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న మాట నిజం. మొదటి ఏడు నెలలూ అరకొర యంత్రాంగంతోనే పాలన సాగింది. మొదటి రెండు
బడ్జెట్‌లూ అంచనాల ఆధారంగా ప్రవేశ పెట్టాం. తరువాత విధానపరమైన మార్పులు, పాలనలో పారదర్శకతతో కోలుకున్నాం. అవినీతిని నియంత్రించి, పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరిచాం. వ్యాపార, వాణిజ్య సంస్థల
నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించి నిలబడగలిగాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపర్చాం. ఇదే తెలంగాణ సుస్థిరతకు నాంది పలికింది. ఆర్థిక ప్రగతికి బాట వేసింది. వచ్చే ఏడాది బడ్జెట్ పెంచుకోగలమన్న ధైర్యాన్నిచ్చింది. ప్రజలకు మరిన్ని
మంచి పనులు
చేయగలమన్న నమ్మకాన్నిస్తోంది. ఇదంతా బంగారు
తెలంగాణకు సానుకూల అంశం.

నాలుగు శాఖల్లో భారీ వృద్ధి

రియల్టీలో 64 శాతం
ఎక్సైజ్‌లో 120 శాతం
వినోద పన్ను 36 శాతం
అమ్మకపు పన్ను 17 శాతం

హైదరాబాద్, జూన్ 14: ఆదాయ వృద్ధిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల్లోనే (ఏప్రిల్, మే) రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 27.45 శాతం నమోదైంది. ఈ స్థాయిలో ఆదాయ వృద్ధి మరే రాష్ట్రంలోనూ కనిపించలేదని ఆర్థిక నిపుణులు విశే్లషిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొనడం, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి నమోదు కావడం పట్ల సిఎం కె చంద్రశేఖర్‌రావుతో పాటు ఉన్నతాధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. దేశంలో మరే రాష్ట్రానికీ సాధ్యంకాని విధంగా రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 27.45 శాతం సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఈ రెండు నెలల్లో ఆర్థిక స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సిఎం కె చంద్రశేఖర్‌రావు మంగళవారం సమీక్షించారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు నెలల ఆదాయంతో ఈ ఏడాది వచ్చిన ఆదాయాన్ని పోల్చిచూస్తే అద్భుత పురోగతి కనిపించిందని అధికారులు వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండే 10 ముఖ్యశాఖల ద్వారా నిరుడు (2015-16) ఏప్రిల్, మే నెలల్లో రూ.6,031 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అదే రెండు నెలల్లో రూ.7,687 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుటి ఆదాయంతో పోలిస్తే ఇది రూ.1656 కోట్లు ఎక్కువ. పెరిగిన ఆదాయంతో లెక్కలేస్తే వృద్ధి రేటు 27.45 శాతం. వృద్ధి రేటు ఇదే తరహాలో కొనసాగితే గత ఏడాది వార్షికాదాయం (స్టేట్ ఓన్ రెవిన్యూ) కంటే ఈ ఏడాది రూ.11.5 వేల కోట్లు అదనంగా ఉండొచ్చని గణాంకాలు చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న పారదర్శక విధానం, వివిధ శాఖల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు, నూతన పారిశ్రామిక విధానం, రియల్టీకి కల్పించిన రాయితీలు, అవినీతిరహిత విధానాలేనని ప్రభుత్వం విశే్లషిస్తోంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడం వల్ల స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయం నిరుడితో పోలిస్తే 64 శాతం పెరిగింది. అలాగే ఎక్సైజ్ శాఖ ఆదాయం అయితే రికార్డుస్థాయిలో 120 శాతం పెరిగింది. దీనికి కారణం హైదరాబాద్ నగరం అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదిక కావడంతో దేశ, విదేశాలకు చెందిన వారితో స్టార్ హోటళ్లు కిక్కిరిసిపోవడం ఒక కారణంగా అధికారులు విశే్లషించారు. వినోద పన్నులపై 36 శాతం, అమ్మకపు పన్నులపై 17 శాతం ఆదాయం పెరిగిందని అధికారులు వివరించారు. ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం సహజ ఆదాయ వృద్ధిరేటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రాదాయం రెండింతలు పెరిగిందన్నారు. రాష్ట్ర ఆదాయం రికార్డుస్థాయిలో వృద్ధి కనపించడం పట్ల సిఎం కె చంద్రశేఖర్ రావు స్పందిస్తూ ‘నిజానికి తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంది. దాదాపు ఏడు నెలల పాటు పూర్తిస్థాయి అధికారులు లేకుండానే పాలన కొనసాగింది. మొదటి రెండు బడ్జెట్‌లు కేవలం అంచనాల ఆధారంగా ప్రవేశ పెట్టుకున్నాం. తర్వాత మెల్లమెల్లగా కోలుకున్నాం. రాజకీయ సుస్థిరత సాధించాం. అనేక విషయాల్లో విధానపరమైన మార్పులు చేసుకున్నాం. పాలనలో పారదర్శకతను పెంపొందించాం. అవినీతిని తగ్గించగలిగాం. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులు కల్పించాం. శాంతి భద్రతలను మెరుగుపర్చాం. దీనివల్లే తెలంగాణ రాష్ట్రం సుస్థిరత సాధించింది. ఆర్థిక ప్రగతికి బాటలు వేసింది. ఇదే విధమైన ప్రగతి కొనసాగితే వచ్చే ఏడాది బడ్జెట్ మరింత పెరుగుతుంది. ప్రజలకు మరిన్ని మంచి పనులు చేసే వెసులుబాటు కలుగుతుంది. బంగారు తెలంగాణకు ఇది సానుకూల అంశం’ అని విశే్లషించారు.

చిత్రం... రికార్డు స్థాయలో ఆర్థికాభివృద్ధి సాధించడంపై రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్షిస్తున్న సిఎం కెసిఆర్