తెలంగాణ

బీజేపీ జాబితా మరో రోజు జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో తొలి విడతలో ఏప్రిల్ 11న జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని బీజేపీ గురువారం నాడు నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికీ ఐదు నుండి 10కి పైగా దరఖాస్తులు పరిశీలనకు వచ్చాయి, ఈ దరఖాస్తులు అన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిటీ గురువారం రోజంతా కూర్చుని స్క్రూటినీ చేసింది , ప్రతి నియోజకవర్గానికీ మూడు మూడు పేర్లు ఖరారు చేశారు. 17 లోక్‌సభ స్థానాలకు 51 పేర్లతో జాబితాను ఢిల్లీలో పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తున్నట్టు ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు చెప్పారు. గురువారం రాత్రి ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికీ మూడు పేర్లలో ఓక పేరును ఎంపిక చేస్తారని అన్నారు. జాబితాను 16వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందు ఎన్నికల కమిటీ ఉంచుతుందని, పేర్లను కమిటీ కూర్చుని ఖరారు చేశాక, ఢిల్లీలోనే జాబితాను విడుదల చేస్తారని అన్నారు. పార్టీ ఎన్నికల కమిటీ సాయంత్రం వరకూ ఐదు నియోజకవర్గాల పేర్లను ఖరారు చేసింది, రాత్రికి మిగిలిన నియోజకవర్గాల పేర్లను కూడా ఖరారు చేసి, శుక్రవారం నాడు ఆ జాబితాతో ఎన్నికల కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్తారని రామచందర్‌రావు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర కమిటీ ఖరారు చేస్తుందని, లోక్‌సభ ఎన్నికలు కనుక జాతీయ పార్టీ సీట్లను ఖరారు చేస్తుందని చెప్పారు.