తెలంగాణ

వికటించిన అల్పాహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: మైనారిటీ గురుకుల పాఠశాలలో టిఫిన్ వికటించి 61 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఎక్కడో ఒక చోట తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాతబస్తీ షాలిబండ చార్మినార్ పరిధిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో గురువారం ఉదయం అల్పాహారం తిన్న 61 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రవ్వ పిండితో చేసిన బొండాలు తిన్న తరువాత వాంతులు, విరోచనాలు అయ్యాయి. అధికారులు వెంటనే విద్యార్థినులను మీరాలం మండిలోని ఆస్రా అసుపత్రికి తరలించారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి పాఠశాలను సందర్శించి సంఘటనపై ఆరాతీశారు.
అల్పాహారాన్ని పరిశీలిద్దామని దాన్ని తిన్న వెంకటి కూడా అస్వస్థతకు గురయ్యారు. సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చార్మినార్ శాసన సభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్రా అసుపత్రిలో చికిత్స పొందిన విద్యార్థినుల్లో దాదాపు 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 20 మంది విద్యార్థినులు అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని ఆస్రా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అధికారులు బాధ్యత వహించాలి: టీపీఏ
దీనికి అధికారులే బాధ్యత వహించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో సంగారెడ్డి, చేవెళ్ల, వికారాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో వందలాది మంది విద్యార్థులు ఆహార కలుషితం వల్ల అస్వస్థతకు గురైన ఘటనల నండి తేరుకోకముందే తాజా ఘటన భయాందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు.