తెలంగాణ

ఎస్‌ఎల్‌బీసీ ముంపు భూములకు పరిహారం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, మార్చి 14 : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం తమ భూములకు పూర్తిస్థాయిలో పరిహారం అందించకుండానే 2008 నుండి ఇప్పటివరకు ప్రభుత్వం, జెపీకంపెనీ పనులు చేస్తూ తమకు పరిహారం అందించలేదని నిర్వాసిత రైతులు రెడ్యనాయక్, శంకర్, మల్లమ్మ సత్తయ్య హర్య, లలిత వాపోయారు. కేవలం పట్టా భూములకే పరిహారం అందించారని లావుని పట్టా, అసైన్డ్ భూములకు ఎటువంటి పరిహారం అందించకుండా మొండిచేయి చూపారని వారు ఆరోపించారు. ఇంకా 12 వందల ఎకరాల భూములకు పరిహారం అందించాలని వారు పేర్కొన్నారు. తమ భూములలో వ్యవసాయం చేసుకోవడం లేదని వాటికి సంబంధించి పరిహారం అందుకోవడం లేదని వాపోయారు.