తెలంగాణ

దేశం చూపంతా కేసీఆర్ సభవైపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 14: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారిగా కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్న దృష్ట్యా దేశం చూపంతా కరీంనగర్ వైపే ఉందని, ఇంటింటికి బొట్టుపెట్టి సభకు పిలిచి జయప్రదం చేయడం కోసం నాయకుల నుంచి కార్యకర్తల వరకు సైనికులుగా పనిచేయాలని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ లోక్‌సభ సమరభేరి సభాస్థలి ఏర్పాట్లను గురువారం మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌లతో పాటు ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్‌లు పరిశీలించారు. 16 లోక్‌సభ స్థానాలు కైవసమే ఏకైక లక్ష్యంగా ఆది నుంచి తెరాసకు కొండంత అండగా నిలుస్తున్న కరీంనగర్ నుంచే లోక్‌సభ ఎన్నికల సమరభేరి సభ నిర్వహించనున్న దృష్ట్యా ఈ సభ సక్సెస్‌పైనే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అంతా దృష్టి సారించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దాదాపు రెండున్నర లక్షల మందిని సమీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సభను నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 16 ఎంపీ స్థానాలు కైవశం చేసుకుంటే కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయని, ఇంటింటికి బొట్టు పెట్టి ఈ సభకు ప్రజలను ఆహ్వానించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని మంత్రులు సూచించారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మన మద్దతు కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేంద్రంలో చక్రం తిప్పి దేశ రాజకీయాల్లో ప్రభావితం చేసేందుకు తెలంగాణ ప్రజలంతా గత అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పునిచ్చినట్లు ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఓర్పుతో నేర్పుగా తీర్పు ఇవ్వాలని కోరారు.

చిత్రం.. సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఎన్నికల ప్రచార సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు ఈటల, కొప్పుల