తెలంగాణ

దేశ రాజకీయాలను శాసించే యుక్తి తెరాసదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 15: కేంద్రంలో భారత ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే శక్తి, యుక్తిగా తెరాస అవతరించనుందని, రానున్నది సంకీర్ణ యుగమే దేశ రాజకీయాలను శాసించే యుగంగా మారనుందని కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో ఈ నెల 17న జరిగే కేసీఆర్ బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్లో శుక్రవారం ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఇక రానున్నది సంకీర్ణ యుగమేనని, సంకీర్ణ యుగమే దేశ రాజకీయాలను శాసించే యుగంగా మారనున్నాయన్నారు. కేంద్రంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే శక్తిగా తెరాస అవతరించనుందని, కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న లోపాలను సవరణ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లలో తెరాస అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరముందని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని పునరుద్ఘాటించారు. కేంద్రాన్ని నడిపిస్తున్న మోడీ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేదని, 12 పార్టీల మద్ధతుతో అధికారం కొనసాగించిందని ఎంపీ ఎద్దేవా చేశారు. త్వరలో రైల్వే జంక్షన్‌గా మారబోతోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉన్నప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రెండు ఎజెండాలతో కేసీఆర్ బహిరంగ సభ పెట్టుకున్నామని, రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ చేయడంతో పాటు తెరాస అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, ఈ సభ నుండే కేసీఆర్ ప్రజలకు పిలుపునివ్వనున్నారని తెలిపారు. పోలీస్ వెల్ఫేర్ హౌజింగ్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న 16 లోక్‌సభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి ఫలాలు అనుభవిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ అక్బర్ హుసేన్, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య, ఫుడ్ కమీషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.