తెలంగాణ

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 15: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అసాంఘీక సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర నార్త్‌జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో అక్కడి ఎస్పీ కోటిరెడ్డి, కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్య పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా మొత్తం ఎన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయో గుర్తించి వాటిని తగ్గించాలన్నారు. ప్రతి ఒక పోలీస్ స్టేషన్ దగ్గర ఎలక్షన్ కమీషన్ ఉత్తర్వుల మేరకు సరిపడా పోలీసు సిబ్బందిని ఉపయోగించుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకునే సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలన్నారు.
సజావుగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా పూర్తి చేసుకోవాలన్నారు. పార్టీల పరంగా ఎలాంటి రాగద్వేషాలకు లోనవ్వకుండా అలాంటి పార్టీ తరపున బంధువుల తరుపున గాని ఎవర్ని ప్రలోభపెట్టకుండా వారి వారి డ్యూటీ చేసుకోవాలన్నారు. జిల్లాల్లో సమస్యలు గల ప్రాంతాలను బట్టి బైండోవర్లు చేసుకోవాలన్నారు. గత ఎన్నికల మాదిరిగానే అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలన్నారు. ఎలక్షన్ దృష్ట్యా ఆయుధాలను డిపాజిట్ చేసుకోవాలన్నారు.