తెలంగాణ

హిందూజాకు ఇచ్చిన 11 ఎకరాల భూమి వెనక్కి తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: హిందూజా కంపెనీకి లోగడ అప్పగించిన 11 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ భూములపై ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఇనె్వస్టిగేషన్ చేసి సీబీఐకి నివేదిక పంపించినా, సీబీఐ ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. 2009 సంవత్సరంలో హిందూజాకు కట్టబెట్టిన భూములను వెనక్కి తీసుకుని అక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతునిచ్చారని ఆయన చెప్పారు. కానీ లోక్‌సభలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్ల-కార్డులు పట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎలా మద్దతునిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలా పార్టీ ఫిరాయింపులను చూడలేదన్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలను ప్రజలు కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆయన హెచ్చరించారు. వైకాపా నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.