ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణులకు స్వయం సహాయక సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 14: బ్రాహ్మణ కులంవారితో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుచేసి ఈ సంఘాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని చెబుతూ విజయనగరం జిల్లాలో కూడా ఈమేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ ఎంఎం నాయక్‌తో కలసి డిఆర్‌డిఎ, మెప్మా, దేవాదాయశాఖల అధికారులతో, బ్యాంకర్లతో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసిందని చెప్పారు. బ్రాహ్మణ కుటుంబాల వారితో ఏర్పాటుచేసే స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
పట్టణంలోని పూల్‌బాగ్ కాలనీలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 20సెంట్ల స్థలం మంజూరు చేసారని తెలిపారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాలలో కూడా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం విజ్ఞాపనలు వచ్చాయని, వీటికి అవసరమైన స్థలాలను గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. అవసరమైన స్థలాన్ని కేటాయిస్తే బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పేద బ్రాహ్మణులు మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకుంటే కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. కుల, ఆదాయ ధ్రువీకరణ సర్ట్ఫికెట్ల జారీలో ఇబ్బందులు కలుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్‌కు తెలపగా తగిన చర్యలు తీసుకునేలా రెవెన్యూ అధికారులకు ఆదేశిస్తామని కలెక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఏడాది నుంచి జిల్లా వార్షిక రుణప్రణాళికలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలు, నిధులను కూడా పొందుపరుస్తామని, బ్యాంకుల వారీగా లక్ష్యాలను నిర్ధేశిస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ ఢిల్లీరావు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రకాష్, దేవాదాయ శాఖ అసిస్టెంటు కమిషనర్ పుష్పనాథం, లీడ్ బ్యాంక్ మేనేజర్ గురవయ్య పాల్గొన్నారు.

రైల్వేల్లో జనని సేవ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 14: ప్రయాణికులకు మె రుగైన సేవలందించాలనే సంకల్పాన్ని దక్షిణ మధ్య రైల్వే నెరవేర్చింది. ప్రయాణంలో ఉన్న తల్లులు తమ చిన్న పిల్లల విషయంలో ఆందోళన చెందకుండా శుభవార్తను ప్రకటించింది. జననీ సేవ పథకాన్ని ప్రవేశపెట్టి చిన్న పిల్లలకు వేడిపాలు, వేడి నీళ్లు, ఆహార పదార్థాలను అం దించేందుకు నిశ్చయించుకుంది. దక్షిణ మధ్య రైల్వే 53 రైల్వే స్టేషన్లలో ఈ పథకాన్ని అమలు పరుస్తోంది. సుమారు 32 దూరపు ప్రాంతపు రైళ్లలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకంలో భాగంగా చిన్న పిల్లలకు వేడిపాలు, వేడి నీళ్లతోపాటు ఆహార పదార్థాలు అందిస్తారు. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా ఎప్పటికప్పుడు సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా మానవీయ కోణంలో ‘జననీ సేవ’పై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రయాణికుల అవసరాల మేరకు సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో చేపట్టిన ఈ పథకంలో నాణ్యత పాటించాలని, తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నివేదిక పంపుతుండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే స్టేషన్లలోని అన్ని ఫుడ్ ప్లాజాలలో, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో, జన ఆహార్, మిల్క్ పార్లర్లలో కూడా చంటి పిల్లల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

గోవాలో జాతీయ
హిందూ సమ్మేళనం

19 నుంచి ప్రారంభం
హైదరాబాద్, జూన్ 14: హిందూ దేశ స్థాపన కోసం, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలను ఐక్యం చేసే లక్ష్యంతో ఈనెల 19 నుంచి 25 వరకు గోవాలో పంచమ జాతీయ హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్టు హిందూ జన జాగృతి సమితి అధ్యక్షుడు చేతన్ జనార్దన్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో శివసేన తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు మురారీ, నేతాజీ స్ఫూర్తి కేంద్రం వ్యవస్థాపకుడు సీతారామయ్యతో కలిసి మాట్లాడారు. హిందూ దేశంగా ఉన్న భారతదేశంలో హిందువులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట హిందువులపై దాడులు జరుగుతున్నాయని, కాశ్మీరీ పండితులు దేశంలో విదేశీయులుగా జీవిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆరు రోజుల పాటు కొనసాగే సమావేశాలకు దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన హిందూ సంస్థలతో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల నుంచి సైతం ప్రతినిధులు హాజరై ప్రసంగిస్తారని చెప్పారు. కాశ్మీరీ పండిట్‌ల పునరావాసం, ఆర్టికల్ 370 రద్దు, గోహత్య ప్రతిబంధ చట్టం అమలు చేయడం, రామమందిర పునఃనిర్మాణం వంటి వాటిపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు.