తెలంగాణ

సమాచారమివ్వనందుకు రూ.10వేలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: ఆర్‌టీఐ చట్టం కింద సమాచారం కోరిన 76 సంవత్సరాల మహిళ (పిటిషనర్)కు సంవత్సరాల తరబడి సమాచారం ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేసినందుకు ఆమెకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ ఎస్. రాజా సదారాం సంబంధిత అధికారిని ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ టీఎస్‌ఎస్ లక్ష్మి 2001లో వైద్య, విద్యా శాఖ (డీఎంఈ) నుంచి వైద్యాధికారిగా పదవీ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ తర్వాత 2002లో పెన్షన్ రీ-్ఫక్షేషన్, సర్వీసు బుక్ వంటి అంశాల గురించి ఆమె డీఎంఈకి దరఖాస్తు చేసుకున్నారు. సంవత్సరా లు గడుస్తున్నా వైద్య, విద్యా శాఖ సమాచార అధికారి (పీఐవో) సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రికార్డులు తమ వద్ద లేవని, ఏపీకి వెళ్లి ఉంటాయని, ఇందుకు తమకు మరికొంత సమయం కావాలంటూ పీఐవో జాప్యం కాలయాపన చేస్తూ వచ్చారు. హైదరాబాద్‌లో పెన్షన్ తీసుకుంటున్న తన ఫైలు ఆంధ్రప్రదేశ్‌కు ఎలా వెళుతుందన్న ఆమె ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో విసిగి పోయిన డా. లక్ష్మి 2017లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) సదారాం వద్ద తన బాధ ను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. సదా రాం మూడు పర్యాయాలు కేసు విచారణ జరిపినప్పుడు ఆమెకు సంబంధించిన పే-్ఫక్సేషన్, సర్వీసు బుక్ ఫైళ్లను తీసుకుని రావాలన్నా కుంటి సాకులతో జాప్యం చేయడం జరిగింది. పదవీ విరమణ చేసి 17 ఏళ్లయనా తాను కోరిన సమాచారాన్ని ఆమె రాబట్టుకోలేక పోయారు. పైగా హెల్త్‌కార్డు కోసం సర్వీసు బుక్ కూడా ఆమెకు అవసరమైంది. అదీ కూడా లేకుండా, పెన్షన్ పునరుద్ధరణ అయ్యిందో కూడా తెలియకుండా పోయింది. మరోవైపు భర్తను కోల్పోయి పుట్టెడు బాధతో ఉన్న 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిణి సమాచారం ఇవ్వకుండా ఆర్‌టీఐ చట్టాన్ని ఉల్లంఘించిన సదరు అధికారికి రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ సదారాం షోకాజ్ నోటీసు జారీ చేశారు. అంతేకాకుండా సమాచారం ఇవ్వకుండా జాప్యం చేసినందుకు పిటిషనర్‌కు ప్రాథమికంగా రూ. 10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. రెండు నెలల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసుపై తదుపరి విచారణ కొనసాగుతుంది.