తెలంగాణ

టార్గెట్ న్యూడెమోక్రసీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మార్చి 16: పోలీసులు న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాలను టార్గెట్ చేస్తున్నాయా..? ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీకి తప్ప మరే ఇతర ఎర్ర పార్టీలకు అజ్ఞాత దళాలు లేవు. అజ్ఞాత దళాలను నడుపుతున్న న్యూడెమోక్రసీపై పోలీసులు సీరియస్‌గా ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నల్లబెల్లి మండలం మురళీనగర్‌లో షెల్టర్ తీసుకుంటున్న సూర్యం దళంపై పోలీసులు ఎటాక్ చేయగా దళ నాయకుడు సూర్యం చాకచక్యంగా తప్పించుకోగా , దళ సభ్యుడు లక్ష్మణ్ పట్టుబడ్డ విషయం పాఠకులకు తెల్సిందే. ఈ ఘటన మరవకముందే నర్సంపేట పక్కనే గల గూడూరు ఏజెన్సీలోని దుబ్బగూడెంలో న్యూడెమోక్రసీ ఉత్తర తెలంగాణ రీజియన్ కమిటీ సభ్యుడు పెనుక వెంకన్న అలియాస్ విక్రమ్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వైద్యం కోసం దుబ్బగూడెం వచ్చి ఓ ఇంట్లో షెల్టర్ తీసుకుంటుండగా పక్కా సమాచారం మేరకు గూడూరు పోలీసుల సహకారంతో స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గత ఏడాది కాలంగా న్యూడెమోక్రసీ అజ్ఞాత దళాల కదలికలపై పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టు (పీపుల్స్‌వార్), ప్రజాప్రతిఘటన, ప్రతిఘటన, జనశక్తి, రెడ్ ప్లాగ్ అజ్ఞాత దళాలపై ఉక్కు పాదం మోపి దళాలన్నింటిని పోలీసులు అంతమొందించారు.
ప్రస్తుతం అజ్ఞాతంలో న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన అజ్ఞాత దళాలు మాత్రమే ఉన్నాయి. న్యూడెమోక్రసీ పార్టీకి నర్సంపేట డివిజన్‌తో పాటు పక్కనే గల మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, ఇల్లందు, మానుకోట ప్రాంతాలలో మంచి పట్టు ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా పార్టీ ఓ వైపు లీగల్ కార్యకలాపాలు నడుపుతూనే, మరో అజ్ఞాత దళాలతో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. డెమోక్రసీ సిస్టంలో అజ్ఞాతానికి ఆస్కారం లేనే లేదని, ఉన్న న్యూడెమోక్రసీ దళాల కార్యకలాపాలకు చెక్ పెట్టేందకు ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. వరుస సంఘటనలతో న్యూడెమోక్రసీలో అంతర్మథనం మొదలైంది. పోలీసులు తమ దళాలను టార్గెట్ చేశారని ఆ పార్టీ లీగల్ నాయకులు అంచనాకు వచ్చారు. అజ్ఞాతంలో ఉంటూ కాంట్రాక్టర్ల వద్ద చందాల దందా చేస్తున్నారని, పంచాయతీలు నిర్వహిస్తున్నారని, న్యూడెమోక్రసీ దళాలను అటవీ ప్రాంతం నుండి లేకుండా చేసేందుకు పోలీసులు ఉన్నతాధికారులు నిర్ణయించి ఆ దిశగా టార్గెట్ న్యూడెమోక్రసీ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిసింది. 20 రోజుల వ్యవధిలో మురళీనగర్ దళ సభ్యుడు లక్ష్మణ్, దుబ్బగూడెంలో దళ నేత విక్రమ్ పోలీసులకు పట్టుబడడం న్యూడెమోక్రసీ నాయకత్వానికి కోలుకోలేని దెబ్బతగిలింది.

లీగల్ నాయకుల కదలికలపై నిఘా..

బయట ఉండే లీగల్ నాయకుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. తమ మాట వినని వారిని అజ్ఞాత దళాల వద్దకు తీసుకెళ్లి బయపెడుతున్నారనే ఫిర్యాదులు పోలీసు ఉన్నతాధికారులకు అందడంతో పోలీసులు ఎన్‌డీ దళాలను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో గ్రామాలు, మండలాలు, డివిజన్, జిల్లాల వారిగా నాయకుల కదలికలపై తమ వేగుల ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు సమాచారం తెప్పించుకుంటున్నారు.
చిత్రం..మురళీనగర్‌లో పోలీసులకు పట్టుబడ్డ ఎన్‌డీ దళ సభ్యుడు లక్ష్మణ్