తెలంగాణ

బాసరలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మార్చి 16: ప్రసిద్ద పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువుదీరిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణను ఆలయ అర్చకులు, అధికారులు మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద మంత్రోచ్చరణతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి అక్షరాభ్యాస మండపంలో తన మనుమరాలు శ్రీయకి ఆలయ స్థానాచార్యుడు ప్రవీన్‌పాఠక్, ప్రధాన అర్చకుడు సంజీవ్‌పూజారీలచే అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వి జస్టిస్ రమణకు పట్టు వస్త్రాలు, అమ్మవారి మెమోంటోతో సన్మానించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి సంధ్యారాణి, ఆలయ చైర్మెన్ శరత్ పాఠక్, ఈసందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అమ్మవారి చరిత్ర, ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ నేషన్ జడ్జి ప్రియ దర్శిని, నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, డీఎస్పీ రాజేష్ భల్లా, నిర్మల్ జిల్లా జేసీ భాస్కర్‌రావు, ఆలయ అధికారులు, పోలీసు సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు.