తెలంగాణ

‘..అనే నేను-స్వేచ్ఛగా ఓటేస్తా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: ‘భరత్ అనే నేను..’ అనే సినిమా ప్రభావం ప్రజలపై బాగా కనిపిస్తోంది. ప్రధాని, సీఎం, మంత్రులు, చట్టసభల సభ్యులు ప్రమాణం స్వీకరించే సమయంలో ప్రతిజ్ఞ చేస్తారు. అందుకు ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ఉంటుంది. ఇలా ఉండగా ప్రజాస్వామ్య వ్యవస్థలో జరిగే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలన్న ప్రచారం అన్ని మీడియాల ద్వారా విపరీతంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ కూడా ప్రతిజ్ఞ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రతిజ్ఞ ఇలా ఉంది.
‘..ఓటర్ అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని, దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడటానికి, ఒక ఓటరుగా నా కర్తవ్యమైన ఓటును శ్రద్దతో, అంతఃకరణ శుద్ధితో, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కాని లేకుండా, నోటుకు, మద్యానికి, కులానికి, మతానికి, సంక్షేమ పథకాల ఎరకు లొంగకుండా వివేచన, విచక్షణా జ్ఞానంతో రాజ్యాంగం నాకు కల్పించిన అత్యద్భుతమైన అవకాశం అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటానని, మన భారత రాజ్యాంగం మీద త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ఉన్న ప్రతిజ్ఞ అన్ని వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్, తదితర రూపాల్లో ప్రచారం అవుతోంది.