తెలంగాణ

భద్రాద్రికి మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జూన్ 15: ఆధ్యాత్మిక, ఇతిహాస ప్రాధాన్యత కలిగిన భద్రాచలం శ్రీ రామ దివ్యక్షేత్రం తాజాగా కేంద్ర రామాయణ వలయంలో చోటు సంపాదించుకుంది. స్వదేశీ దర్శన్ పేరిట దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, ఇతిహాస ప్రాధాన్యమున్న ప్రాంతాలను కలుపుతూ కేంద్ర పర్యాటక శాఖ రామాయణ పర్యాటక వలయంగా ప్రకటించింది. రెండురోజుల క్రితం న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్‌శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేశంలోని 6 రాష్ట్రాల్లో రామాయణ ఇతిహాసం ప్రాధాన్యమున్న 11 ప్రాంతాల ను గుర్తించి జాతీయ నిపుణుల బృందం సిఫార్సు మేరకు పర్యాటక ప్యాకేజీలను ప్రకటించాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, నందిగ్రామ్, శ్రీంగవర్‌పూర్, బీహార్‌లోని సీతామడి, బక్సార్, దర్బంగా, చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్, కర్నాటకలోని హంపి, తమిళనాడులోని రామేశ్వరం, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని భద్రాచలాన్ని కలుపుతూ కేంద్ర రామాయణ పర్యాటక వలయంగా ప్రకటించింది. మహారాష్టల్రోని నాగ్‌పూర్, నాసిక్, మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్, ఒడిశాలోని మహేంద్రగిరిలను కూడా చేర్చే యోచన చేస్తున్నారు. ఈ ప్రాంతాలకు కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో భద్రాచలంలోని శ్రీరామ దివ్యక్షేత్రం కూడా ఆ ప్యాకేజీలో చేరడంతో ఈ ప్రాంత అభివృద్ధికి శుభపరిణామంగా భక్తులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సర్కారు ఆలయ ఆధారిత పర్యాటక ప్రాంతంగా భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తోంది. వేడినీళ్లకు చన్నీళ్లుతోడు అన్నట్టు ఈ నిధులతో అభివృద్ధి కానుంది. కెసీఆర్ సర్కారు భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రానికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయనున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో రామాయణం థీమ్‌పార్కు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించితే దక్షిణ అయోధ్య భద్రాచలం కాస్తా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా భాసిల్లుతుందనడం అతిశయోక్తి కాదు.