తెలంగాణ

దశాబ్దాల తర్వాత.. నా పలుకు లేకుండానే ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘నా 42 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవిత పయనంలో మొదటిసారి నా పలుకు, ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి’ అని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఒక హోటల్‌లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు 42 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. విద్యార్థి దశ నుంచే వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొన్నానని ఉప రాష్ట్రపతి చెప్పారు. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ రంగంలో తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా పూర్తి చేశానని ఆయన తెలిపారు. తీవ్రవాదం గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ సమస్య మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలకూ విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు అన్ని దేశాలకూ తీవ్రవాదం పెను సవాల్‌గా మారిందన్నారు. న్యూజిల్యాండ్ ఘటనపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ ఘటన తర్వాత మన దేశ వైమానిక దళం సాహసోపేతంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్‌ను ప్రపంచ దేశాలూ ప్రశంసించాయని ఆయన తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఎదుర్కొంటున్న సమస్య పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట పరిథిపై అవగాహన, శాంతి కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరచుకోవడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, నిలకడతో కూడిన అభివృద్ధిని సాధించుకోవడం వంటివి ప్రధానంగా మన ముందు ఉన్న లక్ష్యాలని ఆయన తెలిపారు. పారిశ్రామికీకరణ, ఆధునీకరణ వల్ల కర్బనం గాల్లో కలిసి కాలుష్యం పెరిగి, వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని అన్నారు. కాలుష్యంతో వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సి ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య సూచించారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు, వసుదైక కుటుంబాల గురించి వివరించారు.