తెలంగాణ

రాజకీయ రిజర్వేషన్ల కోసం బీసీ సంక్షేమ సంఘం ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 17: బీసీలకు రాజ్యాంగబద్ధంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆదివారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరైన బీసీ సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం, స్థానిక సంస్థల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగంలో సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, అప్పటి వరకు అన్ని పార్టీలూ టికెట్ల కేటాయింపుల్లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఓట్లు బీసీలవి, సీట్లు అగ్రకులాలవా?’ అని ఆయన ప్రశ్నించారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 71 సంవత్సరాలుగా ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. గ్రామ పంచాతీయ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తే రాజకీయ పార్టీలు వౌనం వహించడం బాధాకరమని కృష్ణయ్య అన్నారు. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అంజి, రామకృష్ణ నాయకత్వం వహించారు.