తెలంగాణ

టీఆర్‌ఎస్ వైపు ఎమ్మెల్యే భీరం చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడేరు / కొల్లాపూర్ మార్చి 17: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ శాసనసభ్యుడు భీరం హర్షవర్దన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి మొగ్గు చూపుతుండడంతో మండలంలోని కాంగ్రెస్ వాదులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రభంజనం కొనసాగుతుంటే అందుకు భిన్నంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వైపు ప్రజలు నిలబడి భీరం హర్షవర్ధన్‌రెడ్డికి పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో టీ ఆర్ ఎస్ కైవసం చేసుకోగా ఒకే ఒక్కరు భీరం హర్షవర్ధన్‌రెడ్డిని కోడేరు మండల ప్రజలు ఏటికి ఎదురీది అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి తెప్పించారు. కోడేరు మండలంలో ప్రతిసారి టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపే ప్రజలు గత ఎన్నికలలో జూపల్లి కృష్ణారావును తిరస్కరించి కాంగ్రెస్‌కు ఓటు వేయడం వలనే భీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందారని పలువురు చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నిలబడిన భీరం హర్షవర్ధన్‌రెడ్డి మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసం అని కాంగ్రెస్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ భీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే మండలంలో కాంగ్రెస్ భవిష్యత్తు డోలాయమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా అధిష్టానంతో అంతర్గత ఒప్పందం గతంలోనే జరిగిందని ఆ ఒప్పందానికి అనుగుణంగానే భీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూపల్లి కృష్ణారావును ఓడించడం కోసం టీఆర్‌ఎస్‌లోని ఒక వర్గం హర్షవర్ధన్‌రెడ్డికి గుట్టుచప్పుడు కాకుండా అంతర్గతంగా ప్రచారం చేసిందని.. దాని పర్యవసానమే హర్షవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ నుండి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జరుగబోయే పరిణామాలను వేచి చూడాల్సిందే..
నేడు కాంగ్రెస్ పార్టీ సమావేశం?
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని వినిపిస్తున్న నేపథ్యంలో నియోజక వర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసింది. శనివారం నాడు నియోజక వర్గానికి చెందిన కొంత మంది కాంగ్రెస్ నాయకులను హైదరాబాదుకు పిలిపించుకుని వారితో టీ ఆర్ ఎస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే విషయంపై తన అంతరంగికులతో, ముఖ్య కార్యకర్తలతో చర్చించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో వారి సూచన మేరకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల, నాయకుల సలహాలు తీసుకొని ఏ నిర్ణయమైన తీసుకోండని వారు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారి సూచన మేరకు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ కార్యక్రమంలోనే ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డి నిర్ణయం ప్రకటిస్తారని కార్యకర్తలు భావిస్తున్నారు.