తెలంగాణ

జంతు పరిరక్షణ చట్టాలు పటిష్టం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: జంతు పరిరక్షణ సమగ్ర చట్టాలను యురోపియన్ యూనియన్‌లో ఉన్న మాదిరి భారత్‌లోనూ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ న్యాయ విద్య ప్రొఫెసర్ డేవిడ్ ఫవె పేర్కొన్నారు. నల్సార్‌లో మూడు రోజుల పాటు జంతు పరిరక్షణ చట్టాలపై నిర్వహించిన నేషనల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జంతు పరిరక్షణ చట్టాలపై ప్రజాబాహుళ్యంలో చైతన్యం పెరగాలని అభిప్రాయపడ్డారు. చట్టాలు తెచ్చే ముందు చైతన్యం రా వాలని, ప్రజల్లో అవగాహన పెరగాలని, జంతువులు సైతం మన సహ ప్రాణులుగా మనం గుర్తించాలని పిలుపునిచ్చారు. జంతువులపై చిన్నచూపు తగదని, ప్రకృతి పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందన్నారు. భారత్ సహా కొన్ని దేశాలు వన్యమృగాలపైనే దృష్టిపెడుతున్నాయని, సామాన్య జంతువులకూ, కీటకాలకూ సైతం చట్టాలు వర్తిస్తాయనే విషయాన్ని అందరూ గుర్తెరగాలని సూచించారు. అంతర్జాతీయ మానవ హక్కులు ఉన్నట్టే, జంతువులకూ హక్కులు ఉన్నాయని, వాటి గురించి తెలియక జంతువులను క్రూరంగా వధించడం, హింసించడం, బంధించడంపై ఆవేదన వ్య క్తం చేశారు. భారత్‌లో వన్యమృగాల పరిరక్షణకు కఠిన చట్టాలే ఉ న్నాయని, చట్టాల అమలులో న్యాయస్థానాలు సైతం కఠినంగానే వ్యవహరిస్తున్నాయని వివరించారు. వినియోగదారుల హక్కులలో భాగంగా జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శించకుండా చూడటం, జంతువుల విషయంలో సైబర్ చట్టాలు, బ్రాడ్ కాస్టింగ్ చట్టాలు అ ర్థం చేసుకోవడం, జంతువుల వధపై ఆంక్షలు, రాజ్యాంగంలోనే జం తువుల పరిరక్షణకు పౌర శిక్షా స్మృతి మాదిరి జంతు పరిరక్షణ స్మృతిని అమలులోకి తీసుకురావడం జరగాలని చెప్పారు. నల్సార్ యూనివర్శిటీ తొలిసారిగా జంతుపరిరక్షణ చట్టాలపై ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సహకారంతో టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ముదావహమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు కార్యక్రమం విశేషాలను హెచ్‌ఎస్‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌జీ జయసింహ మాట్లాడుతూ 40 మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ అందించినట్టు పేర్కొన్నారు. న్యాయవిద్య, బయోటెక్నాలజీ, జీవావరణ విభాగంలో పనిచేస్తున్న వారికి ఉపయుక్తంగా ప్రస్తుత స్థితి, భవిష్యత్ పరిస్థితులను, చట్టాలలోనూ, పాఠ్యాంశాల్లోనూ తీసుకురావల్సిన మార్పులు, చేర్పులు గురించి వివరించడం జరిగిందని అన్నారు.
చిత్రం.. శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న వీసీ డేవిడ్ ఫవె