తెలంగాణ

కన్నుల పండువగా ధర్మపురీశుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 18: జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి పుణ్యక్షేత్రంలో సోమవారం రాత్రి శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల కల్యాణ మహోత్సవ వేడుకలు వైభవోపేతంగా, కన్నుల పండువగా జరిగాయి. స్థానిక దైవాల బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన మువ్వురు ఇలవేలుపుల కల్యాణోత్సవాల సందర్భంగా సాయంత్రం గోధూళి శుభ ముహూర్తంలో సర్వాంగ శోభితంగా తీర్చి దిద్దిన కల్యాణ వేదికయైన దేవస్థానంలోని శేషప్ప కళా వేదికపైకి ఆలయాలనుండి స్వాముల ఉత్సవ మూర్తులను వేదమంత్రోచ్ఛారణల మధ్య, మంగళవాద్యాలతో భక్తజనం తోడురాగా కొనితెచ్చి ఆసీనులగావించారు. సాంప్రదాయ రీతిలో యజ్ఞోపవీత ధారణ, రక్షాబంధనం, మహాసంకల్పం, భాసిక ధారణం, గోత్రనామ ప్రవరలు, కన్యాదానం, మంగళాష్టకములు, గూడ జీరధారణ, అక్షతారోపణాది కార్యక్రమాలను విధివిధానంగా నిర్వహించారు. ప్రభుత్వ పక్షాన కలెక్టర్ శరత్, పురపాలక సంఘం పక్షాన కమిషనర్ వెంకట్‌రెడ్డి, మేనేజర్ చంద్రశేఖర్, సిబ్బంది, తదితరులు వేరువేరుగా స్వాములకు పట్టు వస్త్రాలు, కట్నకానుకలను సమర్పించారు. సాంప్రదాయాచరణ ప్రకారం జిల్లాలోని వివిధ గ్రామాల నుండి దైవ కల్యాణానికి తలంబ్రాలు, మట్టెలు, మంగళ సూత్రాలను వంశపారంపర్య ఆచార నేపథ్యంలో కానుకలుగా సమర్పించారు. దేవస్థానం డిసి, ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తల పర్యవేక్షణలో, దేవస్థాన ఆస్థాన పౌరోహితులు కందాళై పురుషోత్తమాచార్య, వేదపండితులు, సంబంధిత ఆలయాల అ ర్చకుల ఆధ్వర్యంలో, ప్రముఖ పౌరాణికులు బాచంపెల్లి సంతోష్ శాస్ర్తీ వ్యాఖ్యానంతో నిర్వహించిన కల్యాణోత్సవానికి అశేష భక్తులు హాజరైనారు. ప్రత్యేక టికెట్లు తీసుకుని వేలాదిమంది కల్యాణ కా ర్యక్రమాలలో ప్రత్యక్ష భాగస్వాములైనారు. రాత్రి 10 గంటల వరకూ కల్యాణ కార్యక్రమం కొనసాగింది. రాష్ట్రంలో వేరెచ్చటను లేని విధంగా క్షేత్ర ప్రాచీన ఆచార నేపథ్యంలో, రాత్రి 10గంటలకు ప్రధానాలయాలలో మూల విరాట్టులకు తిరు కల్యాణం జరిపించారు. జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ మార్గదర్శకత్వంలో, డీఎస్పీ వెంకటరమణ పర్యవేక్షణలో, ధర్మపురి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ లక్ష్మీబాబు, ఆధ్వర్యంలో భారీ ప్రత్యేక పోలీసు బృందాలు భారీ పోలీసు బం దోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులను ప్రత్యేక క్యూల ద్వారా వేదిక వద్దకు పంపారు.
చిత్రం.. శేషప్ప కళావేదికపై కల్యాణోత్సవం జరిపిస్తున్న అర్చకులు