తెలంగాణ

కేసీఆర్‌కే దేశ రాజకీయాలు మార్చే సత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, మార్చి 18: కాంగ్రెస్ 50 ఏళ్లు, బీజేపీ పదేళ్లు దేశాన్ని పాలించినప్పటికీ దేశం ఎలాంటి అభివృద్ధి వైపు పరుగులుతీయలేదని, దేశ రాజకీయాలను మార్చే సత్తా కేసీఆర్‌కే ఉందని నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, గతంలో గుజరాత్‌ను నమూనగా తీసుకుంటే కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి తెలంగాణ సంక్షేమ పథకాల వైపు దేశం చూస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి రైతుబంధును కాపీ కొట్టాడని దేశంలో బీజేపీ పాలన ఉన్న రాష్ట్రాల్లో భూప్రక్షలన జరుగకుండానే ప్రధాని కిషాన్‌యోజనను ప్రవేశపెట్టారన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడుతున్నారని, పూల్వామాలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్ 25లక్షలు అందజేశారన్నారు. ఇంతపెద్దమొత్తం దేశంలోనే ఏ రాష్ట్రం కూడ ప్రకటించలేదన్నారు. ఎండిన చెరువులు కలకలాడుతున్నాయని, స్తిరీకరణ ఆయకట్టుకు అవసరమని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర అసెంబ్లి ఎన్నికల హామీలన్ని దశవారిగా నెరవేర్చుతున్నామని, నిరుధ్యోగ భృతి కోసం 2500కోట్ల, అలాగే పెంచిన పెన్షన్లను ఏప్రిల్ నుండి ఇస్తామని, పిఎఫ్ కటాఫ్ లేకుండానే బీడీ పెన్షన్లు ఇస్తున్నామని, జాతీయస్థాయిలో కేసీఆర్ ఉంటేనే మార్పు గత 5 సంవత్సరాల కన్న తెలంగాణ మరింత అభివృద్ధి చెం దుతుందన్నారు. తెలంగాణ సుపారిపాలన వైపు దేశవ్యాప్త చర్చ జరుగుతుందని, జగిత్యాల మున్సిపల్‌లో గులాబి జెండా ఎగురవేయడం తద్యమన్నారు. గతం లో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్నారని, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో 16 మంది ఎంపీలను టిఆర్‌ఎస్ కైవసం చేరకుంటేనే జాతీయ స్థాయిలో చక్రం తీప్పవచ్చని తెలంగాణ నిధులు వరుదల్లా వస్తాయన్నారు. నేడు నిజామాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగసభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్‌కుమార్ టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత