తెలంగాణ

ఫిరాయంపులు కెసిఆర్ పుణ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను బాహటంగా కొనేస్తున్నారు2 అని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ సిఎం కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఫిరాయింపులకు కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు. బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశానికి దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశం అనంతరం దిగ్విజయ్ సింగ్, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత కె జానారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఏఐసిసి నాయకులు ఆర్‌సి కుంతియా, కొప్పుల రాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సిఎం కెసిఆర్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలు చెక్కుచెదరకుండా ఉన్నారన్నారు. నాయకులు, ఎమ్మెల్యేలు వారి స్వలాభాపేక్ష, వ్యాపారాల నిమిత్తం పార్టీ ఫిరాయించారని దిగ్విజయ్ విమర్శించారు. అయితే వెళ్ళిన నాయకులు ఎన్నికలకు ముందు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉన్నందున, వారిని వెనక్కి తీసుకోరాదని పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఆపరేషన్ అవసరం లేదు
తెలంగాణలో పార్టీకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని దిగ్విజయ్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. పార్టీ నాయకులెవ్వరూ పరస్పరం విమర్శలు చేసుకోరాదని సమావేశంలో సూచన చేశానని చెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ నష్టపోయిందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వల్లే సాధ్యమైందని తాము ప్రజలకు చెప్పలేకపోయామని సమాధానమిచ్చారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. తెలంగాణలో తెదేపా, వైకాపా 3ఖతం2 అయ్యాయని, బిజెపి ఉనికి లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నిర్ణయానికి స్పీకర్‌కు గడువు లేదు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేలను బహిరంగంగా కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి విరుద్ధమన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ వద్ద పిటిషన్ దాఖలు చేసినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఆ చట్టంలో గడువేమి లేదని, ఇది చట్టంలోవున్న లోపమేనన్నారు. కాబట్టి ఫిరాయింపుల పిటీషన్లపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా చట్ట సవరణ జరగాల్సి ఉందన్నారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
చట్టం ప్రకారం 123 జీవో చెల్లదు
ఇలాఉండగా ఏఐసిసి ఎస్సీ సెల్ విభాగం చైర్మన్ కొప్పుల రాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణకు సంబంధించి 2013లో యూపీఏ ప్రభుత్వం మంచి చట్టం తెచ్చిందని చెప్పారు. కాగా ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్నారు. ఆర్డినెన్స్‌పై తాము ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. రైతుల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో 123 తీసుకొచ్చిందన్నారు. రైతుల నుంచి భూమి తీసుకుంటే తిరిగి వారికి ప్రత్యామ్నాయంగా భూమి చూపించాలన్న ఉద్దేశ్యంతో 3ల్యాండ్ టు ల్యాండ్2 తెచ్చామని, ఇంకా ఉద్యోగం ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని, చేపల పెంపకానికి భూమి చూపించాలని ఇలా ఎనె్నన్నో ఆ చట్టంలో పొందుపర్చామన్నారు. రైతులకే కాదు రైతు కూలీలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీటన్నింటినీ ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు. చట్టం ముందు జీవో నిలబడదని చెప్పారు. బలవంతంగా భూములు తీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు నెలాఖరులోగా మండల, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నామని, వచ్చే నెలాఖరులోగా నియోజకవర్గాలవారీ కమిటీలు ఏర్పాటు చేసుకుని, తర్వాత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు.

చిత్రం... గాంధీభవన్‌లో దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పిసిసి సమన్వయ కమిటీ సమావేశ దృశ్యం