తెలంగాణ

యాదాద్రిలో శతఘటాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, మార్చి 18: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నిర్వహించిన స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాలతో వైభవోపేతంగా ముగిశాయి. 11రోజుల పాటు నేత్ర పర్వంగా సాగిన పంఛనారసింహుడైన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు ప్రధాన ఆలయం పునర్ నిర్మాణం పనుల నేపధ్యంలో బాల ఆలయంలో నిత్యం పాంఛరాత్రాగమశాస్త్రానుసారం శాస్తయ్రుక్తంగా వేడుకగా సాగాయి. బ్రహ్మోత్సవ పర్వాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10గంటలకు మంత్ర జలాలు, ఫలరసాలు, పంచామృతాలతో కూడిన 108కలశాల పూజలు, కలశ తీర్ధంతో స్వామివారికి అష్టోత్తర శతఘాటాభిషేకం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 9గంటలకు లక్ష్మీనరసింహుడికి శృంగార గీతాలతో డోలోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యుల బృందం శతఘాటాభిషేకం, శృంగార డోలోత్సవాలను శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో మూలవర్యులను అభిషేకించి, కలశ జలాలతో ఉత్సవ మూర్తులను అభిషేకించారు. ఉత్సవాల్లో ఆలయ ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తిలు, భక్తులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల ఘట్టం ముగియ్యడంతో ఆలయంలో నిత్యోత్సవాల కొనసాగింపుకు అర్చక పండితులు ఏర్పాట్లు చేశారు.
చిత్రం..యాదాద్రి బ్రహ్మోత్సవాల చివరి రోజు సోమవారం అష్టోత్తర శతఘటాభిషేకం