రాష్ట్రీయం

మాటలు చూసి ఓట్లు వేస్తారా? పనులు చూసి వేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేసీఆర్ మాటలు చూసి ఓట్లు వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని, బీజేపీ చేసిన పనులు చూసి ఓట్లు వేసేందుకు ముందుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల సభల్లో టీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఐదేళ్లు ఫెయిల్ అయిన టీఆర్‌ఎస్ ఎంపీలను మళ్లీ పాస్ చేయించడానికి కేసీఆర్ విఫల ప్రయత్నాలు చేస్తున్నారని అవకాశం ఇచ్చిన వారికి ప్రజలు మళ్లీ అవకాశం ఇస్తారా అవకాశం ఇవ్వని వారికి మళ్లీ అవకాశం కల్పిస్తారా ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. కేసీఆర్ తన మాటలు చూసి ఓట్లు వేయమని అంటున్నారని, కానీ జనం మాత్రం బీజేపీ పని తీరును చూసి ఓట్లు వేయబోతున్నారని చెప్పారు. మోదీ పాలన పరిపాలన చూసి చాలా మంది బీజేపీలో చేరుతున్నారని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు మాత్రం మోదీవైపు చూస్తున్నారని అన్నారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 16 సీట్లూ గెలిస్తే రాష్ట్రానికి ఏదో చేస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్ నేతలు గతంలో గెలిచి ఏం చేశారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కలిసి గత ఐదేళ్లుగా పార్లమెంటులో ఎంత సేపు మాట్లాడారో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. టీఆర్‌ఎస్ చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని రామచందర్‌రావు పేర్కొన్నారు.
చిత్రం..కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీలో చేరిన దృశ్యం