తెలంగాణ

వైభవంగా యోగానందుని తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 20: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మపుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, దేవస్థానం డిసి, ఇఓ అమరేందర్, చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ధర్మకర్తల పర్యవేక్షణలో, దేవస్థాన యాజ్ఞికులు కందాళై పురుషోత్తమాచార్య, వేద పండితులు ముత్యాల శర్మ, ఉప ప్రధానార్చకులు శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకుల ఆధ్వర్యంలో బుధవారం లక్ష్మీ నారసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం 4.30గంటలకు శ్రీయోగానంద నారసింహ ప్రధానాలయంనుండి వేదమంత్రాలతో, మంగళవాద్యాలతో భక్తజనం తోడురాగా, నారసింహుని ఉత్సవ మూర్తులను బ్రహ్మపుష్కరిణి వద్దకు ఊరేగింపుగా కొని తెచ్చారు. అనంతరం ప్రత్యేక నూతన బహూకృత హంస వాహనంపై స్వామిని ఆసీనుల గావించి, కోనేటి నీటిపై అయిదు ప్రదక్షిణలు నిర్వహించగా భక్తి శ్రద్ధలతో కన్నులారా గాంచిన భక్తులు పూజా ద్రవ్యాలు సమర్పించి కైమోడ్పులిడి తన్మయులైనారు. తరువాత బ్రహ్మపుష్కరిణి మధ్య వేదికపైగల భోగ మంటపములోగల ఊయలలో స్వామిని ఆసీనులజేసి డోలోత్సవాన్ని జరపగా భక్తులు జయజయ ధ్వనాలతో ప్రార్థించారు. ఉత్తర ద్వారంగుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా, ఇరుకైన మార్గంగుండా లోనికి వెళ్ళి కట్న కానుకలను సమర్పించి దర్శనాలు చేసుకున్నారు. రాత్రి 9గంటల వరకూ కార్యక్రమం కొనసాగింది. అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన సందర్భంగా జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ మార్గదర్శకత్వంలో, డీఎస్పీ వెంకటరమణ, ధర్మపురి సిఐ లక్ష్మీబాబు పర్యవేక్షణలో, పలువురు సబ్ ఇన్స్‌పెక్టర్లు, డివిజన్‌లోని పెద్ద మొత్తంలో ఎఎస్‌ఐ/హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డులతో పాటు సెక్షన్ల ప్రత్యేక ఆర్మ్‌డ్ పోర్స్‌తో ఎలాంటి అవాంఛనీయాలు చోటు చేసుకోకుండా ప్రణాళికా బద్దంగా వ్యవహరించి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

చిత్రాలు.. బ్రహ్మపుష్కరిణిలో ఊయలలో ఆసీనులైన యోగానంద నృసింహుడు..
*కోనేటిలో హంసవాహనంపైన లక్ష్మీనరసింహుడు