తెలంగాణ

సింగరేణి, మణుగూర్ ప్యాసింజర్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, మార్చి 20: విజయవాడ- కాజీపేట జంక్షన్ల మధ్య బుధవారం ఉదయం సింగరేణి, మణుగూర్ ప్యాసింజర్ల రద్దు.. ఇంకో వైపు గోల్కొండ మూడు గంటలకు పైగా ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మణుగూర్ నుండి కాజీపేటకు నడిచే ప్యాసింజర్ రైలును గత పక్షం రోజులకు పైగా రద్దు చేయగా, తాజాగా నెక్కొండ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) నుండి సిర్పూర్ టౌన్ వరకు నడిచే సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌ను బుధవారం, గురువారం రద్దు చేశారు. అయితే, డోర్నకల్ నుండి వరంగల్ ఉన్న పలు రైల్వేస్టేషన్ల ద్వారా నిత్యం ఉదయం పూట వరంగల్ వెళ్లేందుకు అధికులు ఈ రైళ్లనే ఆశ్రయిస్తుండగా ఆ రెండు రైళ్లు రద్దు కావడం.. ఈ రెండు రైళ్లకు తోడు వరంగల్‌కు వెళ్లడానికి గూంటూర్ నుండి సికింద్రాబాద్ వెళ్లే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ కూడా బుధవారం నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. ఈ రైలు ఉదయం ఉదయం 9-27 గంటలకు కేసముద్రం రావాల్సి ఉండగా, బుధవారం మధ్యాహ్నం 1-20 గంటలకు వచ్చింది. కాజీపేటకు మధ్యాహ్నం 2-32 గంటలకు వెళ్లింది. ఉదయం 8 గంటల నుండి 10-30 గంటల్లోపు నడిచే మూడు రైళ్లలో రెండు రద్దు కావడం.. ఒకటి గంటల తరబడి ఆలస్యం కావడంతో వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ వరకు వెళ్లే ప్రయాణికులు కొందరు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ వెళ్లారు. సికింద్రాబాద్, జనగామ, ఘనాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గోల్కొండ వచ్చేంతవరకు స్టేషన్లలోనే పడిగాపులు పడ్డారు.

చిత్రం..నాలుగు గంటలు ఆలస్యంగా నడిచిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్