తెలంగాణ

ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, మార్చి 20: గత అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరూ ప్రధాన ప్రత్యర్థులు.. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు.. ఒకరిని ఓడించేందుకు మరోకరు సర్వశక్తులు ఒడ్డారు.. వీరి వెంట నడిచిన కార్యకర్తలు కూడా ఒకరంటే ఒకరు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే తీరుగా పంతాలకు పోయారు. కాని నెలల వ్యవధిలోనే అంతా మారిపోయింది.
వాళ్లిదరు ఒక్కటయ్యారు. తెరాస రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చిరునవ్వులు చిందిస్తూ చేతులు కలుపుకొన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే పురాతన నానుడిని మరోసారి నిజం చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యలు బుధవారం హైద్రాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో కలసిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఎంపి అభ్యర్ధికి అందజేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోరం కనకయ్య తెరాస నుండి ఎమ్మెల్యేగా పోటీచేయగా హరిప్రియా నాయక్ కాంగ్రెస్ నుండి బరిలోకి దిగారు. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో హరిప్రియనాయక్ విజయం సాదించారు. హరిప్రియానాయక్ కాంగ్రెస్‌కు రాజీనామ చేసి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకే పార్టీ నాయకులుగా మారిపోయారు.
క్యాడర్‌ను ఒకటి చేస్తూ ముందుకు నడిపించే ఉద్దేశ్యంతో బుధవారం హైద్రాబాద్‌లో వీరిద్దరితోపాటు వారి ప్రధాన అనుచరులతో కేటీఆర్ భేటి అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో వీరిద్దరు చేతులు కలిపారు.
చిత్రం.. కేటీఆర్ సమక్షంలో చేతులు కలుపుకుంటున్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్యే కొరం కనకయ్య