తెలంగాణ

మూడు కోట్ల జెండా మూటగట్టేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: దేశంలోనే రెండో అతి పెద్ద జాతీయ పతాకానికి అవస్థ వచ్చిపడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం హుస్సేన్‌సాగర్ తీరాన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అతి పెద్ద జాతీయ జెండా పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటైంది. ఏర్పాటు చేసి వారం గడవకముందే దీని నిర్వహణ ఆగమ్యగోచరంగా తయారైంది. సాగర తీరాన ఎంతో ఆకర్షణీయంగా 291 అడుగుల ఎత్తు కల్గిన స్తంభం, మొత్తం దిమ్మెలతో కలుపుకుని 301 అడుగుల ఎత్తుపై 72 అడుగుల ఎత్తు, వెడల్పు 120 అడుగులు కల్గిన అతి పెద్ద ఈ జాతీయ పతాకాన్ని మూడు కోట్ల వెచ్చించి ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీ (హెచ్‌ఎండిఏ)కు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే! కానీ ఈ జెండాను ఏర్పాటు చేసిన ఈనెల 2 నుంచి ఇప్పటి వరకు గడిచిన 13 రోజుల్లో మూడుసార్లు జెండా చిరిగినట్లు సమాచారం. ఏకంగా 291 అడుగుల ఎత్తుపై బలమైన గాలులు వీస్తున్నందున రెపరెపలాడుతూ జెండా త్వరగా చిరిగిపోతోంది. బుధవారం కూడా పతాకం చిరిగిపోయినట్లు గమనించిన అధికారులు దాన్ని కిందకు దించారు. తిరిగి కొత్త జెండాను ఎగురవేసేందుకు బుధవారం రాత్రి ప్రయత్నంచినా, బలమైన గాలులు వీయటంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. లైట్ల వెలుగుల జిలుగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కన్పించే జాతీయ పతాకం లేక పోల్ కళావిహీనంగా మారుతోంది. ఒక్కసారి జెండాను ఎగురవేసేందుకు రూ.లక్షన్నర వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. జాతీయ జెండా నిర్వహణ విషయంలో ప్రభుత్వ శాఖలు చిత్తశుద్ధితో వ్యవహారించి, బలమైన గాలులకు సైతం చిరగకుండా రెపరెపలాడే పతాకాన్ని ఏర్పాటు చేయాలి. అతి పెద్ద ఈ జాతీయ జెండా నిర్వహణ విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఏదైనా ఒక ప్రభుత్వ శాఖను బాధ్యత చేసి, అందుకయ్యే నిధులను ప్రతి ఆర్థిక సంవత్సరం ముందుగానే విడుదల చేస్తే ఇలాంటి లోపాలు తలెత్తే అవకాశాలుండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.