తెలంగాణ

సందడిగా హోలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హోలీ పండగను గురువారం ఆనందంగా జరుపుకున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా హోలీ పండగ వేడుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వయస్సుతోనూ, బంధుత్వాలతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. హోలీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు. ఇలా ఉండగా రాజ్‌భవన్‌లో ఏటా హోలీ వేడుకలను గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ రద్దు చేశారు. ఇటీవల పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల చేతుల్లో మరణించినందు వల్ల వేడుకలను రద్దు చేసినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. సాధరణంగా రాజ్‌భవన్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ పర్యాయం వేడుకలు లేకపోవడంతో రాజ్‌భవన్ బోసిపోయింది. హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలు సాధారణంగా ఏటా హోలీ వేడుకల్లో పాల్గొంటుండగా, ఈ పర్యాయం ఎన్నికలు తదితర కారణాల వల్ల రాజకీయ నాయకులు పెద్దగా ఉత్సాహం చూపించలేదు.