తెలంగాణ

గ్రామీణుల జీవితాల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాల వల్ల తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన విధానంలో గణనీయమైన మార్పులు రావడం పట్ల ఆసియన్ సివిల్ సర్వెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఈ-పేమెంట్, ఫైనాన్సియల్ ఇంక్లూజన్, సోషియల్ సెక్యూరిటీ’ అంశాలపై హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఆసియన్ సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. ఇండోనేషియా, కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, మలేషియా తదితర దేశాలకు చెందిన సివిల్ సర్వెంట్స్‌కు ఆసియన్ సెక్రెటరేయేట్, జకార్తా నేతృత్వంలో శిక్షణ సాగుతోంది. శిక్షణా కార్యక్రమంలో భాగంగా సివిల్ సర్వెంట్స్ బృందం గురువారం రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామం వచ్చింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చేరడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యలను ఆధునిక టెక్నాలజీ ద్వారా పరిష్కరించుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. మహిళా స్వయం సహాయక బృందానికి చెందిన ఒక మహిళ తమ సంఘం కొనసాగిస్తున్న ఆర్థిక లావాదేవీలు, కుటీర పరిశ్రమల గురించి కంప్యూటర్ ద్వారా సివిల్ సర్వెంట్స్‌కు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూత గురించి వివరించారు. గ్రామాల్లోని వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల నుండి మహిళలు బయటకు వచ్చి సొంతంగా బ్యాంకుల సాయంతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆమె వివరించారు. పేపర్ ప్లేట్లను తయారు చేసే ఒక యూనిట్‌ను, బ్యూటీ పార్లర్‌ను సివిల్ సర్వెంట్స్ బృందం సందర్శించింది. వృద్ధాప్య పింఛన్‌ను బయోమెట్రిక్ విధానంలో అమలు చేస్తున్న విధానాన్ని సంబంధిత పోస్ట్‌మాస్టర్ ఈ బృందానికి లైవ్ డెమాన్‌స్ట్రేషన్ ద్వారా చూపించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) నిర్వహిస్తున్న టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సివిల్ సర్వెంట్స్ బృందం పరిశీలించింది. స్వయం సహాయ బృందాలు గ్రామీణ, మండల, జిల్లా స్థాయిలలో కొనసాగిస్తున్న కార్యక్రమాలను అధికారులు ఈ సందర్భంగా వివరించారు. గ్రామాల్లోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వివిధ సంస్థల్లో ఉపాధి లభించడం ద్వారా గ్రామీణ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వస్తున్నాయన్నారు.
చిత్రం.. స్వయం సహాయ సంఘం సభ్యురాలు ఒకరు కంప్యూటర్ ద్వారా తమ కార్యకలాపాలను వివరిస్తున్న దృశ్యం