తెలంగాణ

‘కోడ్’ ఉల్లంఘిస్తే కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీఈఓ రవి కిరణ్ తిరుమల హెచ్చరించారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తా విభాగం గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార చర్చా గోష్టిలో సవివరంగా మాట్లాడారు. 2019 మార్చి 10 న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడ్డదని, అదే రోజు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ గురించి రాజకీయ పార్టీలు, నేతలు క్షుణ్ణంగా చదివి అమలు చేయాలని సూచించారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలకే కాకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా కోడ్ అమలవుతుందని, పెయిడ్ న్యూస్ ప్రచురించినా, ప్రసారం చేసినా కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. మీడియాపై కూడా వాచ్ ఉందని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీని అరికట్టేందుకు, మద్యం ప్రవహించకుండా కఠినమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన నగదుతో పాటు మద్యం తదితరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజకీయ పార్టీల నేతలు, ఇతరులు తమ ప్రసంగాల్లోకాని, ప్రకటనల్లో కాని ఎదుటి వారిని విమర్శించే సమయంలో సంస్కారం కలిగి ఉండాలని, బూతు పదాలు ఉపయోగించవద్దని హెచ్చరించారు.
అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, కుల, మత, ప్రాంత, బాషా భేదాలకు, పేద, ధనిక అన్న తేడా లేకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని రవి కిరణ్ వివరించారు. ఫ్లయింగ్ స్వ్యాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలియెన్స్ టీమ్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయని కోడ్ ఉల్లంఘన కేసులను పరిశీలిస్తున్నాయని గుర్తు చేశారు. ఇలా ఉండగా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకునేందుకు ‘సీ-విజిల్’ యాప్‌ను రూపొందించామని రవికిరణ్ తెలిపారు. ఇప్పటికే పనిచేస్తున్న సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రజలకు స్నేహపూర్వకంగా ఉండేలా సీ-విజిల్ యాప్‌ను రూపొందించామని, ఈ యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకుని, కోడ్ ఉల్లంఘన ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా యాప్ ద్వారా తమకు తెలియచేయవచ్చన్నారు. సి-విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్య ప్రారంభమవుతుందని, కోడ్ ఉల్లంఘన జరిగిన ప్రాంతానికి అధికారిక బృందాలు వెళతాయని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు సి-విజిల్ యాప్‌తో పాటు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కూడా ఫోన్ చేసి వివరాలు అందించవచ్చన్నారు. సి-విజిల్ యాప్ అందరూ ఉపయోగించే అవకాశం లేకపోవచ్చని, అందువల్ల టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని వివరించారు.
సోషల్ మీడియాపై నిఘా
సోషల్ మీడియాపై నిఘా పెట్టామని జాయింట్ సీఈఓ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలను వాడుకుంటే ప్రకటనల జాబితాలోకి వస్తుందని, వీటిపై నిఘా పెట్టామని ఆయన వివరించారు.
‘చునావ్ పాఠశాల’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నామని, ఓటర్లలో చైతన్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కోటి మంది ఓటర్లకు సీఈఓ ఇటీవల లేఖలు రాశారని రవి కిరణ్ గుర్తు చేశారు.