తెలంగాణ

ఇంతకీ ఎత్తు ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: వినాయక చవితి వచ్చిందంటే అతిపెద్ద వినాయకుడైన ఖైరతాబాద్ గణపయ్యను దర్శించుకోని వారుండరు. కానీ ఈసారి ఈ విగ్రహం ఎత్తు ఎంత అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఏటా విగ్రహం ఎత్తును 17 అడుగులకే పరిమితం చేయాలని ఇప్పటికే పోలీసులు ఉత్సవ సమితి ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది. కానీ 1954లో ఒక్క అడుగుతో అప్పటి కార్పొరేటర్ శంకరయ్య ప్రతిష్ఠించిన ఈ వినాయకుడు ఏటేటా ఒక్కో అడుగు చొప్పున పెరుగుతూ 2014 నాటికి అరవై అడుగులకు చేరడంతో షష్ఠిపూర్తి కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఎత్తును క్రమంగా తగ్గిస్తూ గత సంవత్సరం 59 అడుగుల విగ్రహాన్ని రూపొందించగా, ఈసారి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తోందని, ఉన్నట్టుండి ఈ సారి ఎత్తు తగ్గించమని పోలీసులు సూచించటం ప్రజల మనోభావాల్ని దెబ్బతీయమేనని, ఎత్తును తగ్గించే ప్రయత్నం చేయరాదని ఉత్సవ సమితి ప్రతినిధులకు ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. వినాయక విగ్రహాల ఎత్తును తగ్గించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీసులు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సూచించినా, ఈ ఉత్తర్వులను ఖైరతాబాద్ వినాయకుడికి మినహాయించాలని పలు రాజకీయపార్టీలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. అంతేగాక, సహజ రంగులతో రూపుదిద్దుకుంటున్న ఖైరతాబాద్ గణపయ్యతో పర్యావరణానికి కానీ, హుస్సేన్‌సాగర్ చెరువుకు గానీ ఎలాంటి ముప్పు లేదని, ఈ క్రమంలో ఎత్తు తగ్గించటం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిమజ్జనం తర్వాత కూడా వ్యర్థాలను తొలగిస్తున్నారని, హుస్సేన్‌సాగర్ కలుషితమయ్యేందుకు అనేక కారణాలున్నాయని, రసాయన వ్యర్థాలు చేరుతున్నా, నిన్నమొన్నటి వరకు ప్రేక్షక పాత్ర వహించిన సర్కారు సాగర్ ప్రక్షాళన పేరుతో ఖైరతాబాద్ గణేషుడి ఎత్తును తగ్గించే ప్రయత్నం చేయరాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ గణపయ్యకు ప్రభుత్వం మినహాయింపునిస్తుందా? లేక ఉత్సవ సమితి నిర్వాహకులకు ఎత్తు తగ్గించేందుకు అంగీకరిస్తారా? అన్నది వేచిచూడాలి!