తెలంగాణ

నిజామాబాద్‌లో రైతుల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఒక్కరోజే 162 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 లోక్‌సభా స్థానాలు ఉండగా, అన్నింటిలోనూ ఈ రోజు నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 54 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఇప్పటి వరకు 17 నియోజకవర్గాల్లో కలిపి 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ ప్రాంతంలోని పసుపు రైతులు, ఎర్రజొన్న రైతులు భారీ ఎత్తున నామినేషన్లు వేస్తామని ఇప్పటికే ప్రకటించారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు సరైన మద్దతు ధర ఇప్పించడంలో ప్రభు త్వం విఫలమైందని ఆరోపిస్తున్న రైతులు తమ నిరసన వ్యక్తం చేసేందుకు లోక్‌సభ
ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్లు వేస్తామని వారంరోజుల ముందే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా నామినేషన్లు వేస్తున్నారు. శనివారం, సోమవారం కూడా భారీ ఎత్తున నామినేషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలైతే ఏం చేయాలన్న అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
1996 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో నల్లగొండ నియోజవర్గం నుండి 480 మంది పోటీ చేయడంతో ఆనాటి ఎన్నికల కమిషన్ నల్లగొండ ఎన్నికలను నెలరోజుల పాటు వాయిదా వేసింది. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ నుండి నీటిని నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటిగా ఇవ్వాలని కోరుతూ భారీ ఎత్తున నామినేషన్లు వేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ జల సాధన సమితి నేతృత్వంలో ప్రజలు నామినేషన్లు భారీ సంఖ్యలో వేయడంతో ఎన్నికలను వాయిదావేశారు. ఆ తర్వాత నెల రోజులకు ఈ ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ లోక్‌సభకు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైతే ఏం జరుగుతుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.