తెలంగాణ

ఢిల్లీని శాసించి తెలంగాణ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: రెండు సీట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తమకు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం చెవి పిండి తెలంగాణను అభివృద్ధి చేసుకోగలుగుతామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు మెజార్టీ రాదని దాదాపు అన్ని సర్వేలు తేల్చిచెప్పిన ఈ కీలక సమయంలో టీఆర్‌ఎస్ గెలిచే ప్రతి ఎంపీ సీటు ముఖ్యమేనన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్‌రెడ్డి, బిస్వ కిష్టయ్య, ఎంబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, 3కేంద్రంలో మోదీకి వేడి తగ్గింది...కాంగ్రెస్ గాడీ తప్పింది2 అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా ప్రధాని మోదీ స్పందించలేదన్నారు. కేంద్రాన్ని శాసించగలిగిన స్థితిలో టీఆర్‌ఎస్ ఉంటే రాష్ట్రానికి ఏది కావాలన్నా సాధించుకోవచ్చన్న విషయాన్ని ప్రజలు గ్రహించి టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు మరింత పచ్చబడాలంటే 16 పార్లమెంట్ సీట్లను టీఆర్‌ఎస్సే గెలువాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌గాంధీకి లాభం...బీజేపీకి ఓటేస్తే మోదీకి లాభం తప్ప తెలంగాణకు ఒరిగేది ఏముందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణ గడ్డకు లాభమన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. తెలంగాణలో బీజేపీకి ఉనికి లేదనే ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కార్యకర్తలు అతి విశ్వాసానికి పోకుండా భారీ మెజారిటీ సాధించి చూపించాలన్నారు. ఎక్సైజుశాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, సీఎంగా తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోన్న కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే భారత్ వేగంగా పురోగమిస్తుందన్నారు. తమ అధినేత కేసీఆర్ చెప్పిన వారే దేశానికి ప్రధాని అయినా దేశంతో పాటు తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు సాధించిన మెజార్టీ కంటే రెట్టింపు మెజార్టీని ఎంపీ అభ్యర్థులకు సాధించి చూపిస్తామన్నారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో మిగిలేది ఒక్క టీఆర్‌ఎస్సేనన్నారు.