తెలంగాణ

ప్రతిపక్షం లేకపోతే ప్రశ్నించేదెవరు?: రేవంత్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 22: కేసీఆర్ ప్రతి పక్షం లేకుండా చేయాలనుకుంటే, ప్రజల పక్షాన ఎవరు మాట్లాడతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చీర్యాలలోని జయమోహన్ గార్డెన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన మంత్రిని ఎన్నుకునే ఎన్నికలని, ముఖ్యమంత్రికి సంబంధించినవి కావని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని, ప్రాంతీయ పార్టీల పోటీ కాదని పేర్కొన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్ధానానికి తాను పోటీ చేస్తున్నట్లు తెలియగానే కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజల సమస్యలైన డంపింగ్ యార్డ్, ఐటీ కారిడార్ వంటి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. వందకోట్లు ఖర్చు చేసే ధనవంతులకే కేసీఆర్ టిక్కెట్‌లు కేటాయించారని, తెలంగాణ ఉద్యమకారులకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేసారు. కార్యకర్తలు 20 రోజులు కష్టపడి పనిచేస్తే, 20 సంవత్సరాలు సేవ చేస్తానని అన్నారు. ఆనాడు ప్రతిపక్షం ఉండవద్దని చంద్రబాబు నాయుడు అనుకుంటే, రాజశేఖర్ రెడ్డి ఉండేవారా అన్నారు. వెయ్యి మంది కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి మల్కాజ్‌గిరి కాంగ్రెస్ తరుపున ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ కలెక్టర్ ఎంవీ రెడ్డికి అందజేసారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉద్ధెమర్రి నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మారెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, నాయకులు తోటకూర జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.