తెలంగాణ

కారుణ్య మరణానికి అనుమతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: గ్రూప్-2 రిక్రూట్‌మెంట్ నిర్వహించి ఫలితాలు ఇవ్వడం లేదని, ఉద్యోగాలు వస్తాయని చిరకాలంగా ఎదురుచూస్తున్నామే తప్ప తమ ఆశ నెరవేరడం లేదని పేర్కొంటూ కారుణ్యమరణానికి అనుమతివ్వాలని కొంత మంది గ్రూప్-2 అభ్యర్ధులు శుక్రవారం నాడు మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. అనంతరం వారంతా పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌ను కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరారు. గత రెండున్నరేళ్లుగా పబ్లిక్ సర్వీసు కమిషన్ , తెలంగాణ ప్రభుత్వం అలసత్వం కారణంగా గ్రూప్-2 మెరిట్ జాబితాలో ఉన్నా ఫలితాలు వెలువరించలేని పరిస్థితి ఏర్పడిందని అభ్యర్ధులు వాపోయారు. పరీక్ష నిర్వహణలో మొదటి నుండి సర్వీసు కమిషన్ చేసిన తప్పిదాల వల్ల మెరిట్ లిస్టులో ఉన్న వారంతా బాధితులుగా మారారని అన్నారు.
రెండున్నరేళ్ల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నామని, ఎన్నిసార్లు ఎవరిని కలిసి ఎంతగా విన్నవించినా, స్పందన కొరవడుతోందని వారు చెప్పారు. తీవ్ర మానసిన వేధనతో తాము ఈ విధంగా కోరుతున్నామని అభ్యర్ధులు గీత, సుజాత, శ్రావ్య, రజిత, వినయ్, ఇమ్రాన్, గోపాల్, ప్రమోద్ తదితరులు పేర్కొన్నారు.