తెలంగాణ

దేవేందర్ గౌడ్‌తో రేవంత్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతునివ్వాల్సిందిగా టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ హోం మంత్రి టీ. దేవేందర్ గౌడ్‌ను కోరారు. శనివారం రేవంత్ రెడ్డి దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్ళి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఇరువురూ కొంత సేపు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేవేందర్ గౌడ్ తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని చెప్పారు. దేవేందర్ గౌడ్‌కు ఈ నియోజకవర్గంలో పట్టు ఉందన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించేందుకు తాను దేవేందర్ గౌడ్ వంటి పెద్దల ఆశీస్సులు తీసుకుంటున్నానని చెప్పారు. ఇటీవల తాను టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులను కలుసుకుని మద్దతు పొందానని ఆయన తెలిపారు.