తెలంగాణ

అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 23: నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి గెలుపుపై నమ్మకముంటే, దమ్ముంటే హుజూర్‌నగర్ నియోజకవర్గం శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంట్ ఎన్నికల్లో దిగాలని, శాసన సభ్యత్వాన్ని వదులుకునే దమ్ములేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని ముందే ఒప్పుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీష్‌రెడ్డి సవాల్ విసిరారు. శనివారం నల్లగొండ పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూపార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు పోటిపడే అభ్యర్థులే కరువయ్యారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలు నేడు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పరిపాలనలో గుణాత్మక మార్పు కోరుతున్న ప్రజలు కేసీఆర్ పాలన విధానాలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. బోఫోర్స్ కాంగ్రెస్‌ను, రాఫెల్ బీజేపీలను ఓడించి ఆదర్శనీయమైన అభివృద్ధి సంక్షేమ పాలనకు ప్రజలు టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు 16ఎంపీ స్థానాలిస్తే కేంద్రంలో కీలక శక్తిగా మారి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కులు సాధించడం సులభమవుతుందన్నారు. ఇందుకు కేసీఆర్ పిలుపు మేరకు ప్రజలు 16స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. నిన్నమొన్నటిదాకా ఉత్తమ్ అసమర్ధ నాయకత్వంతోనే కాంగ్రెస్ పతనమవుతుందంటు కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శలు చేయగా, పరస్పరం దద్దమ్మలు అంటు తిట్టుకోవడం ప్రజలు మరువలేదన్నారు. టీఆర్‌ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి నరసింహారెడ్డి 1987లో ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోగా, రాజకీయాలకు దూరమై వ్యాపారాలకు పరిమితమయ్యారన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనకు ఆకర్షితులైన వేమిరెడ్డి అవకాశమిస్తే ప్రజాసేవ చేస్తానంటు ముందుకొచ్చారన్నారు. మునుగోడులో చెల్లని రూపాయి వేమిరెడ్డి అంటు ఉత్తమ్ నోరుపారేసుకున్నారని, కోదాడలో 1994ఎన్నికల్లో ఉత్తమ్ ఓడిపోయిన సంగతి విస్మరించారని మంత్రి ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం నల్లగొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని ఇక్కడ చెల్లని రూపాయి వెంకట్‌రెడ్డి భువనగిరిలో చెల్లుతారా అంటు ఉత్తమ్‌ను నిలదీశారు. నల్లగొండ ప్రజల తిరస్కారంతో భువనగిరి పార్లమెంట్‌కు పారిపోయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అక్కడి ప్రజలు కూడా ఓడించి తరిమేస్తారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటలు గులాబీ సేన దాటికి మంచుకోటల మాదిరిగా కరిగిపోయాయన్నారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనను, నాలుగున్నర ఏళ్ల టీఆర్‌ఎస్ పాలనను పథకాలను చూసిన ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించి అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో గెలిపించారన్నారు. జిల్లాకు పట్టిన ఫ్లోరైడ్ మహమ్మరిని పారద్రోలేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ తెచ్చారన్నారు. జిల్లా సాగుతాగునీటి అభివృద్ధికి ఎస్‌ఎల్‌బిసి, ఉదయసముద్రం పనులను కొనసాగిస్తునే డిండి ఎత్తిపోతల పథకం చేపట్టారన్నారు. యాదాద్రి థర్మల్ ఫ్లాంట్ నిర్మాణం, నల్లగొండ, సూర్యాపేటలలో మెడికల్ కళాశాలలు తెచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో సాగునీటికి అల్లాడిన సాగర్ ఆయకట్టు రైతులకు టీఆర్‌ఎస్ పాలనలో రెండు పంటలకు నీరు అందిస్తున్నామన్నారు. ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవిందర్‌రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి, రేఖల భద్రాద్రి, శరణ్యారెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం.. నల్లగొండ పార్లమెంట్ టీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహక సదస్సులో మాట్లాడుతున్న జగదీష్‌రెడ్డి