తెలంగాణ

లే-ఔట్లు, అపార్ట్‌మెంట్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2017 జనవరి 1 నుండి 2018 మార్చి 31 వరకు అభివృద్ధి చేసిన లే-ఔట్లు, 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది ఫ్లాట్లకు మించి నిర్మించిన అపార్ట్‌మెంట్లకు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నుండి అనుమతి తీసుకోవాలని రెరా ప్రకటించింది. అథారిటీ అధ్యక్షుడిపేరుతో ఈ మేరకు శనివారం అధికారికంగా ప్రకటన జారీ అయింది. అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి, లేఔట్ల అభివృద్ధికి అనుమతి పొందిన వారు ఈ నెల 31 లోగా రెండులక్షల రూపాయలు పెనాల్టి చెల్లించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. కొంతమంది రియల్టర్లు రెరాలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తమ లే-ఔట్లను, అపార్ట్‌మెంట్లను అమ్మివేసేందుకు వివిధ మీడియాల ద్వారా ప్రకటనలు జారీ చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు జారీ చేయడం చట్టప్రకారం నేరమన్నారు.