తెలంగాణ

16 ఎంపీ సీట్లు సాధిస్తే నిర్ణయాత్మక శక్తిగా టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగాపూర్: టిఆర్‌ఎస్ పోటీ చేయనున్న 16కు 16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశంలో నిర్ణయాత్మక శక్తిగా టిఆర్‌ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించనుందని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, కోనాపూర్, రేచపల్లి, బీర్‌పూర్ మండలంలోని కొల్వాయి, భీర్‌పూర్ గ్రామాల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి రోడ్‌షో, సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎంపి కవిత మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తారని పువ్వు, చేతిగుర్తు పార్టీలు అంటున్నాయని, రెండు ఎంపి సీట్లతో తెలంగాణ సాధించిన విషయం ఆ పార్టీలు మరిపోయయా అని ఆమె ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తుందని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయన్నారు. తెలంగాణలో 16 సీట్లలో 16 టిఆర్‌ఎస్ గెలిస్తే కెసిఆర్ తనదైన తెలివితో వాటిని 116 చేసి చూపిస్తారని అన్నారు. కెసిఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ అన్ని రాజకీయ పార్టీలతో దోస్తాన చేస్తూ కూటమి కడుతున్నారని, వచ్చే ప్రభుత్వంలో దేశంలో జరిగే నిర్ణయాలలో కీలకపాత్ర పోషిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. కెసిఆర్ లాంటి మంచి మనిషి ఉంటే రాష్ట్రంలో మంచిపనులన్నీ దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని అన్నారు. గత ఐదేళ్లలో జగిత్యాలకు 1200కోట్ల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని, ఈ ఐదేళ్లలో 2500కోట్లు నిధులు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో గత 60ఏళ్లలో 11సార్లు కాంగ్రెస్ ఎంపిలు, 3సార్లు టిడిపి ఎంపిలు గెలిచారని, తాను కేవలం ఒకసారి మాత్రమే గెలిచి 15వేల కోట్ల నిధులు సాధించానని తెలిపారు. గతంలో ఈ నిధులలో సగం కూడా ఏ పార్టీలు సాధించలేకపోయాయని అన్నారు. గత ఐదేళ్లలో 60ఏళ్లలో కాని అభివృద్ధిని అన్ని గ్రామాలలో చేసి చూపించామని ప్రజలు ఆలోచించి మరోసారి కారుగుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. వచ్చే రెండేళ్లలో మొదటి ప్రాధాన్యతగా జగిత్యాల నియోజకవర్గంలోని పేదలందరికీ ఇండ్లు కట్టించేందుకు కృషి చేస్తానన్నారు. మట్టి పనికి పోయిన మనోళ్లు ఉంటేనే సంకల్పం నెరవేరుతుందని అందుకే డిల్లీలోనూ ఏర్పాటైన ప్రభుత్వాన్ని శాసించేందుకు గల్లీ పార్టీ అయిన గులాబి జెండాను రెపరెపలాడించేందుకు ప్రజలందరు కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు.
చిత్రాలు.. రోడ్‌షోలో ప్రసంగిస్తున్న నిజామాబాద్ ఎంపీ కవిత.. *రోళ్లవాగు ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్న కవిత