తెలంగాణ

లక్షలో 211 మందికి టీబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: తెలంగాణ రాష్ట్రంలో ట్యూబర్కులోసిస్ (టీబీ) వ్యాధిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు ప్రత్యేక సర్వే చేస్తున్నామని, నివారణకు బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని టీబీ జాయింట్ డైరెక్టర్, స్టేట్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజేశం తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రపంచ టీబీ దినోత్సవం మార్చి 24 న ఉన్నప్పటికీ, తెలంగాణలో మార్చి 25 న అమలు చేస్తున్నామన్నారు. 24 న ఆదివారం సెలవు కావడంతో 25 న టీబీ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రాజధానితో పాటు, జిల్లాల్లోనూ వేర్వేరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు నిజాం కాలేజ్ గ్రౌండ్స్ నుండి రాష్టస్థ్రాయి ప్రధాన ఊరేగింపు మొదలవుతుందని, ఈ ఊరేగింపు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియం వరకు కొనసాగుతుందన్నారు. ఈ ఆడిటోరియంలో ఉదయం 11 గంటల నుండి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని, ఉన్నతాధికారులతో సహా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్ రాజేశం తెలిపారు. మహబూబ్‌నగర్, వికారాబాద్, భద్రాచలం, కరీంనగర్, హైదరాబాద్ (చెస్ట్ హాస్పిటల్) తదితర ఆసుపత్రులు ప్రత్యేకంగా టీబీ నివారణకోసం పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమానితులందరికీ టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి లక్ష మందిలో 211 మంది టీబీకి గురవుతున్నారని ఒక సర్వేలో తేలిందన్నారు. వీరిలో 142 మందికి ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స చేస్తున్నామని, మిగతావారు ప్రైవేట్‌గా చికిత్స పొందుతుండవచ్చన్నారు. వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయిన 52 వేల మందిలో 42 వేల మందికి ఒకవైపు మందులు ఉచితంగా ఇస్తూనే, మరోవైపు నెలకు 500 రూపాయల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నామని, పౌష్టికరమైన ఆహారం కోసం ఈ సాయం చేస్తున్నట్టు వివరించారు. మరో 10 వేల మంది బ్యాంక్ అకౌంట్లు ఇవ్వకపోవడం తదితర కారణాల వల్ల డబ్బు జమ చేయడం లేదన్నారు. ఈ విధంగా మొత్తం దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ చేశామని స్పష్టం చేశారు. వ్యాధి సోకిన వారికి ఇస్తున్న మందుల్లో మెజారిటీ రోగులకు వ్యాధి తగ్గుతోందన్నారు. వ్యాధి తీవ్రంగా ఉండి సాధారణ మందులకు తగ్గకపోతే ‘బెడాక్విలైన్’ మందు ఇస్తున్నామన్నారు.