తెలంగాణ

పవన్‌వి చిల్లర రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రాలో ఓట్ల కోసం జన సేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్ధ చైర్మన్ గ్యాదరి బాలమల్లు విమర్శించారు. తెలంగాణపై, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుపై అనవసరంగా నోరు పారేసుకుంటే సహించేది లేదని ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆంధ్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వకపోతే హైదరాబాద్‌లోని వాళ్ళ భూములు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి ఆంధ్రలో ఓట్లు సంపాదించాలని పవన్ చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలోని ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణ బిడ్డలేనని, వారికి పూర్తి భద్రత కల్పించే బాధ్యత తమదేనని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పలు పర్యాయాలు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఆంధ్ర వాళ్ళ భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించిన పవన్ కల్యాణ్ అందుకు తగిన ఆధారాలు ఉంటే చూపించాలని బాలమల్లు డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళపై ఎక్కడైనా దాడులు జరిగాయా? వివక్ష చూపించడం జరిగిందా? అని ఆయన పవన్‌ను నిలదీశారు. ఆంధ్రలో పోటీ చేస్తున్న జన సేనకు ఓటమి తప్పదని ముందుగానే తెలుసుకున్న పవన్ కల్యాణ్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో లోపాయికారిగా చేతులు కలిపి, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణను పాకిస్థాన్‌తో పోలుస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బాలమల్లు డిమాండ్ చేశారు.