తెలంగాణ

నామినేషన్లకు నేడే చివరిరోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సోమవారం చివరిరోజు. తెలుగు సంవత్సరం ప్రకారం సోమవారం పంచమి. పంచమి మంచి రోజుగా భావిస్తుంటారు. అందువల్ల ఈ రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నెల 18 న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత రాష్ట్రంలోని 17 లోక్‌సభా స్థానాలకు మొత్తం 220 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ నుండి 57 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్‌లో 5, పెద్దపల్లిలో 14, కరీంనగర్‌లో 11, జహీరాబాద్‌లో 6, మెదక్‌లో 8, మల్కాజిగిరిలో 19, సికింద్రాబాద్‌లో 14, చేవెళ్లలో 8, హైదరాబాద్‌లో 8, మహబూబ్‌నగర్‌లో 11, నల్లగొండలో 15, నాగర్‌కర్నూలులో 4, భువనగిరిలో 15, వరంగల్‌లో 12, మహబూబాబాద్‌లో 6, ఖమ్మంలో 11 నామినేషన్లు దాఖలయ్యాయి.
17 లోక్‌సభా నియోజకవర్గాలకు గాను, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ప్రత్యేకత సంతరించుకుంది. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పసుపు, ఎర్రజొన్న పంటలు ఎక్కువగా పండతాయి. వీటికి సరైన ధరలు లభించడం లేదని, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని భావిస్తున్న రైతులు తమ ఆవేదనను దేశానికి చాటేందుకు భారీ ఎత్తున లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేయాలని నిర్ణయించారు.