తెలంగాణ

మహబూబ్‌నగర్‌లో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 16: మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని ధర్మాపూర్ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల బారిన పడ్డారు. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దేవరకద్ర నుండి టిఎస్06జడ్0197 నంబర్ గల ఆర్టసీ బస్సు, ఏపి22ఎక్స్ 3640నంబర్ గల ఆటోను మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలో గల ధర్మాపూర్ దగ్గర ఢీకొట్టింది. దీంతో మహబూబ్‌నగర్ నుండి దేవరకద్ర వైపు వెళ్తున్న ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌నగర్ పట్టణం బండ్లగేరికి చెందిన అంజమ్మ (50), లక్ష్మమ్మ (60), శిరీష (3), రామయ్యభౌళికి చెందిన సయ్యద్ ఖాజా(42) మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న పోతన్‌పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మైబు, వెంకటయ్య, సింథుజల తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్సైలు రాజేశ్వర్‌గౌడ్, సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుపై చె ల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ రామకృష్ణ తెలిపారు.
సంఘటన స్థలాన్ని డిఎస్పీ కృష్ణమూర్తితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కూడా పరిశీలించారు. బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు డిఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఈ విషయం తెలియడంతో జనం ప్రమాద స్థలానికి వందలాదిగా చేరుకున్నారు. ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతి చెందడం అందరినీ కలిచివేసింది.