తెలంగాణ

మోదీ..రాహుల్ మధ్యే ప్రధాన పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, మార్చి 24 : 2019 పార్లమెంట్ ఎన్నికలు ఏంతో ప్రతిష్టాత్మకమైనవని..దేశ భవిష్యత్తు, పేదల ఆశలను, సంపన్నుల దోపీడీని ఆర్థిక వ్యత్యాసాలు పెంపుపై ప్రజలు నిర్ణయించే ఎన్నికలని సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు ప్రధాని నరేంద్రమోదీ..ఏఐసీసీ చీఫ్ రాహుల్‌గాంధీ మధ్యనే పోటీ అని ప్రజలు ఇద్దర్ని నిశితంగా గమనిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. కార్పొరేట్ వ్యవస్థలోని సంపన్నుల ల కొమ్ము కాసి లక్షల కోట్ల రుణాలు మాఫీ, పేద ప్రజలను విస్మరించినట్లు విమర్శించారు. 2004 నుండి దశాబ్ధకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రధాని, ఉప ప్రధాని లాంటి పదవులను రాహుల్‌గాంధీ త్యాగం చేశారన్నారు. దేశ భవిష్యత్తు కోసం నలుమూలలు పర్యటించి ప్రజలను సమన్వయం చేసేందుకు రాహుల్‌గాంధీ కృషిచేసినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, గొప్పలు చెప్పుకున్నారని, గణాంకాలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. గుజరాత్‌లో చమురు నిక్షేపాలు వెలుగులోకి తెస్తామని చెప్పి 19వేల 200 కోట్ల కుంభకోణానికి పాల్పడింది మోదీ సర్కారేనని ఆరోపించారు. 2005-2010 వరకు 14వేల కోట్ల ఖర్చు చేశారని ఆరోపించారు. మలేసియా దేశానికి చెందిన సాధరణ కంపెనికి 5వేల కోట్లకు అనుమతి ఇచ్చారన్నారు. వివిధ బ్యాంకుల నుంచి రుణం పొందిన మోదీ సర్కార్ ప్రతియేట 200 కోట్లు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ఆకంపెనీని చమురు సంస్ధలో విలీనం చేశారని, తాను చెప్పింది కాదని, కాగ్ వెల్లడించిందన్నారు. నల్లధనం వెలికి తీస్తానని, స్వీస్ బ్యాంక్‌లోని డబ్బులు తెచ్చి పేదలకు 15లక్షలు పంపిణీ చేస్తానని, 100 రోజుల్లో నిత్యవసర ధరలు తగ్గిస్తానని, చమురు ధరలు తగ్గిస్తానని హామీనిచ్చి అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించారన్నారు. పెద్ద నోట్ల రద్దు చేసి సామాన్య ప్రజలను రోడ్ల పాలు చేశారని ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ బ్యారెల్ ధరలు తగ్గితే దేశంలో పెంచిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 10లక్షల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలపై భారం వేశారన్నారు. ప్రజలు ఉపయోగించే గ్యాస్ ధరలను సైతం రెట్టింపు చేశారన్నారు. రైతులను ఆదుకుంటామని చెప్పి రోజుకు 15రూపాయలు ప్రకటించి కపట ప్రేమను ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఆత్మహత్యల నివారణకు కాంగ్రెస్ పార్టీ 2లక్షల రుణమాఫీ ప్రకటించిందన్నారు. గతంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీ మేరకు 2లక్షల రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికను 90శాతం అమలు చేసిన కాంగ్రెస్ పార్టీదే నన్నారు. రైతులను, పేదప్రజలను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే నని స్పష్టం చేశారు. 17 రూపాయలు ఇచ్చే మోదీ సర్కార్ కావాలో.. 2లక్షల రుణమాఫీ చేసే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు తెల్చుకోవాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం..దేశ దశ, దిశను మార్చే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కంకణ బద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, ప్రజాతీర్పుకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు, ఓటమీలు సర్వ సాధరణమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సిద్దిపేట కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికి, సన్మానించారు. ఈసమావేశంలో పీసీసీ సంయుక్త కార్యదర్శి కొండల్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్‌వర్మ, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి దాసరిరాజు, అత్తుఇమామ్, నాయకులు ఆది శ్రీనివాస్, నర్సయ్య పంతులు తదితరులు పాల్గొన్నారు.