తెలంగాణ

హామీల అమలులో కేసీఆర్, మోదీ విఫలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మార్చి 24: దేశం, రాష్ట్రంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు గత ఐదేళ్లుగా మోసపు మాటలతోనే పదవీ కాలం గడిపారని ఒక్కటంటే ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పట్టణ, మండల పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనన్నారు. కేసీఆర్ మోదీపై అవిశ్వాసంలో మోదీకి అనుకూలంగా వ్యవహరించారని, రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, రాజ్యసభ ఉపాధ్యక్షుల ఎన్నికల్లో, జిఎస్‌టి బీజేపీకి అనుకూలంగా ఓటేశారన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు.
12 గెలిచి మిగిలినవి ఫిరాయింపు, మజ్లీస్ ఎంపీలు కలిసి 16 మంది ఉన్నప్పటికీ కేంద్రం నుండి ఏం సాధించావని, ఇప్పుడు ఏం సాధిస్తావని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, వారు సాధించని బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరి, ఎస్‌టీ యూనివర్సిటీ, ఐటిఎఆర్‌లు సాధిస్తామని పేర్కొన్నారు. తాను నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని తన సెల్ నెంబర్ నమోదు చేసుకోవాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఎంపీకి సాధించి పెట్టిన మెజారిటిని ఈ సారి కూడ సాధించాలని కోరారు. ప్రజా, పార్టీ సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దేశంలో మోదీ వర్సెస్ రాహుల్ పోటీ జరుగుతుందని, రాహుల్ ప్రధాన మంత్రి కావడం ఖాయమని సిఎల్‌పి మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దేశాభివృద్ధి కాంగ్రెస్‌తోనే జరిగిందని, జరుగుతుందన్నారు. మోసపు మాటల పీఎం, సీఎంలను ఓడించాలని కోరారు.
చిత్రం.. మిర్యాలగూడలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి