తెలంగాణ

జిఎస్‌టి బిల్లుపై బిజెపి-కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 29: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తున్న వస్తుసేవల పన్నుల విధింపు బిల్లు ఆమో దం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని, ఎన్డీఎ-యుపిఎ కూటమిల మ్యాచ్ ఫిక్సింగ్ మరో మారు స్పష్టమైందని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతా రాం ఏచూరి ఆరోపించారు. ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల దాడులకు అమెరికా, ఐరో పా దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక దోపి డీయే కారణమన్నారు.
ఆదివారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి రెండు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీతా రాం ఏచూరి మాట్లాడుతూ కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే జిటిఎ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే బిజెపి పాలిత రాష్ట్రాలు అడ్డుకున్నాయని, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ స్వయంగా అడ్డుకున్నాడని, నేడు పార్లమెంటులో ప్రవేశపెట్డం విచారకరమన్నారు. రాష్ట్రాల అంగీకారం లేకుండా వస్తు సేవల పన్ను బిల్లు ఏకపక్షంగా అమలు సాధ్యం కాదన్నారు. వ్యాట్ వల్ల రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయిందని, రాష్ట్రాల ఆదాయం పెంచడానికి అమ్మకం పన్నులు పెంచవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేసారు. రాష్ట్రాలతో మాట్లాడి నిర్ధిష్టమైన విధానం తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. జిఎస్‌టి బిల్లు ప్రక్రియ పదేళ్ల క్రితమే ప్రారంభమైందని, యం పవర్ కమిటికి స్పష్టమైన విధానాన్ని సిపిఎం తెలియజేసిందని గుర్తు చేసారు. కాంగ్రెస్ బిజెపిల లోపాయికారి అవగాహన ఏంటో తమ కు తెలియదని, పార్లమెంటులో చర్చకు వస్తేనే అసలు విషయం బయటపడుతుందని, అప్పటి వరకు సభ్యులకు, దేశ ప్రజలకు తెలియదన్నారు. తాలిబన్లను అమెరికా ప్రోత్సహించిందని, సిరియా, ఇరాక్ దేశాల్లో యుఎస్‌ఎ ఆర్మీ ఐఎస్‌ఐఎస్‌ను ప్రోత్సహించిందని, ప్రస్తుతం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని బలిపశువును చేయడం బాదాకరమన్నారు. వ్యక్తిగత, సామాజిక టెర్రరిజాలు అత్యంత ప్రమాదకరమైనవన్నారు. రక్షణ, మీడియారంగంలో విదేశి ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించడం చాలా ప్రమాదకరమైందన్నారు.
వీటి వల్ల భవిషత్‌లో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందన్నారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చేస్తున్న ప్రచారం డొల్లతనానికి నిదర్శనమన్నారు. ఎక్కడ కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న వాటిని కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో కొనుగోలు శక్తి లేనప్పుడు ఎన్ని పెట్టుబడులు వచ్చినా లాభం లేదన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, అప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక కమిటీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే ఎన్డీఎ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసిందని దీంతో ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించే పది శాతం నిధులు 18 నెలలుగా నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో ఆ ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోయిందని, ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతినిధులు ప్రధాన మంత్రిని సమావేశాలకు ఆహ్వానించినా వెళ్లలేదని విమర్శించారు.
ప్లానింగ్ కమిటి రాజ్యాంగం నిర్దేశించిన విధి విధానాలుంటే నీతి ఆయోగ్‌కు ఎలాంటి అధికారులు లేకపోవడం శోచనీయమన్నారు. దేశంలో అడుక్కుతినాల్సిన పరిస్థితులను ఎన్డీయే ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విలేఖరుల సమావేశంలో బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.

మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఏచూరి తదితరులు