తెలంగాణ

పార్టీ ఫిరాయింపులు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 16: ఒక పార్టీ తరఫున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తమ పదవులను అంటిపెట్టుకుని మరో పార్టీలో చేరడం అనైతికం, అప్రజాస్వామికమని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార తెరాస, తెలుగుదేశం పార్టీలు ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నాయని, ఈ తరహా వలసలను ప్రోత్సహించడం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అయితే వలసలను రాజకీయ పునరేకీకరణగా పేర్కొంటూ సమర్థించుకుంటున్నారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన వారిని తెరాసలో చేర్చుకుంటే అది రాజకీయ పునరేకీకరణ ఎలా అవుతుందని దత్తాత్రేయ ప్రశ్నించారు. గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ పార్టీల పట్ల ప్రజలు ఆకర్షితులు కావాలే తప్ప, ఇతర పార్టీల నాయకులను వలస రావాల్సిందిగా ప్రోత్సహించడం ముమ్మాటికీ అనైతిక చర్యేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల పాలకులు వలసలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టిసారించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. తెలంగాణలోనూ మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలలో కరవు పరిస్థితులు నెలకొని ఉన్నందున కేంద్ర ప్రభుత్వంతో కలిసి కరవు సహాయక చర్యలకు నడుంబిగించాల్సిన అవసరం ఉందన్నారు.
నిజాం షుగర్స్ సమస్యపై సిఎంతో చర్చిస్తా
నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిలతో చర్చిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎఫ్ చక్కెర కర్మాగారం మూతబడి, కనీసం కార్మికులకు నెలల తరబడి వేతనాలు కూడా చెల్లించకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులు, చెరుకు రైతుల పక్షాన సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు.

చిత్రం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ